అరవై యేండ్లలో క్రేజ్..


Wed,June 5, 2019 12:58 AM

ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, అందరినీ నవ్వించడం కొందరి వల్లే అవుతుంది. ఇలాంటి కామెడీని ఎవరైనా ఆహ్వానిస్తారు. ముంబైకి చెందిన అరవై యేండ్ల రాజేశ్వరి కూడా ఇలా చేస్తున్నది. ఇంగ్లీష్ పదాల ఉచ్ఛారణను నవ్వు తెప్పించేలా పలుకుతూ నెటిజన్‌ల నుంచి క్రేజ్ పొందుతున్నది.
rajeswari
ఒక్కోసారి తెలియని పదాల ఉచ్ఛారణ నవ్వు తెప్పిస్తుంది. దాన్ని పాయింట్‌గా చేసుకొని ఈ మధ్య సోషల్ మీడియాలో చాలానే వీడియోలు వైరల్ అయ్యాయి. ఇందులో రాజేశ్వరీ చేసిన వీడియోలు ఎక్కువ వైరల్ అవుతున్నాయి. ముంబై కమెడియన్ గౌరవ్ గెరా ఇంట్లో పని మనిషి. ఈమె పదాల ఉచ్ఛారణ భిన్నంగా ఉండడంతో గెరా సోషల్ మీడియా పేజీలను క్రియేట్ చేసి ఇలాంటి ఫన్నీ వీడియోలు సృష్టిస్తున్నాడు. ఆమె టీచర్‌గా వ్యవహరిస్తూ, బోర్డుపై పదాలను రాసి ఉచ్ఛరిస్తున్నది. పదాల ఉచ్ఛారణ ఫన్నీగా ఉండడంతో ఫాలోయింగ్ బాగా పెరిగింది. తాజాగా ప్రముఖ హాలీవుడ్ నటుడు, టర్మినేటర్ హీరో ఆర్నాల్డ్ స్కార్జెనెగర్ పేరును ఆర్నాల్డ్ సుభాష్‌నగర్‌గా ఉచ్ఛరించి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీటితో పాటు ఈ మహిళ సొంతంగా షార్ట్ వీడియోలు, టిక్‌టాక్‌లు చేసి అరవై యేండ్ల వయస్సులో నెటిజన్ల నుంచి క్రేజ్ సంపాదించింది. రాజేశ్వరికి ఇన్‌స్టాగ్రామ్‌లో 30 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. కొందరు ఈ ఉచ్ఛారణ ప్రాంక్‌గా భావించకుండా నిజమనుకొనే కామెంట్లు చేయడం తరచూ జరుగుతుంది. కానీ వాటిని సరదాగానే తీసుకొని మరిన్ని వీడియోలు తయారు చేస్తున్నదామె.

973
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles