యాంటీ రేప్ చీరెలు!


Sun,June 2, 2019 01:38 AM

వినడానికి వింతగానే ఉన్నా.. ఇది నిజమే. మహిళల దుస్తులు, అలంకరణపై కామెంట్లు చేసేవారికి వ్యతిరేకంగా సాగుతున్న కొత్త నిరసన ఇది. మహిళకు కాలి నుంచి ముఖం వరకూ ఏమీ కనిపించకుండా చీరెలు కట్టుకొని నిరసన తెలియజేయడం ఈ కార్యక్రమ ఉద్దేశం.
Rape-Saries
ఢిల్లీలో ఇటీవలే కురచ దుస్తులు వేసుకున్న అమ్మాయిలపై అసభ్యకర కామెంట్లు చేసింది ఓ మహిళ. దీంతో అమ్మాయిలంతా ఆమెను చుట్టుముట్టడంతో రెండ్రోజులకు క్షమాపణ కూడా చెప్పింది. మన దేశంలో మహిళలు వేసుకునే డ్రెస్సులపై ఎప్పటి నుంచో వివాదాలు నడుస్తున్న విషయం విదితమే. ముఖ్యంగా నిర్భయ లాంటి ఘటనలు కొన్ని జరిగాక.. మహిళలు కురచ దుస్తులు వేసుకోరాదని, సాంప్రదాయ దుస్తులు ధరించాలని, మోడ్రన్ దుస్తులు ధరిస్తే వారిపై అత్యాచారం చేస్తారని వింత ప్రచారం ఊపందుకున్నది. ఈ నేపథ్యంలో అలాంటి వారికి కౌంటర్‌గా సేఫ్టీ అనే ఓ స్వచ్ఛంద సంస్థ యాంటీ రేప్ చీరెలు పేరిట కొన్ని ప్రత్యేకమైన చీరెలను డిజైన్ చేసి, ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది. www.sanskari-saree.com అనే సైట్లో యాంటీ రేప్ చీరెలను విక్రయిస్తున్నారు. ఆ చీరెలు ఇప్పుడు నెట్లో వైరల్ అవుతున్నాయి. వీటికి నెటిజన్ల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది.

4791
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles