ఏ ఎండకైనా సోలార్ గొడుగు!


Sun,June 2, 2019 01:38 AM

solar-umbrella
ఐడియా.. జీవితాన్నే మార్చేస్తుంది అనే దానికి ఈ పెద్దాయనే ఉదాహరణ. భారీ ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఈయన తయారు చేసిన సోలార్ గొడుగు కొత్త ఆవిష్కరణకు నాంది పలికింది. ఈ సోలార్ ఫ్యాన్ అంబ్రెల్లాతో మండుటెండల్లోనూ, మిట్టమధ్యాహ్నం కూడా ఎంచక్కా బయటి ప్రదేశాల్లో తిరుగుతున్నాడు. గొడుగు లోపల చిన్నపాటి ఫ్యాన్ అమర్చి ఎండ వేడిమి నుంచి సేద తీరుతున్నాడు. గొడుగు పై నుంచి సౌరశక్తిని గ్రహించేలా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేశాడు. సోలార్ విద్యుత్ శక్తితో గొడుగు లోపలి ఫ్యాన్ తిరుగుతుంది. ఈయన సోలార్ గొడుగుతో వెళ్తున్న దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి, టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చెయ్యడంతో వైరల్ అవుతున్నది.

1410
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles