మోడీ కుల్ఫీతో సెల్ఫీ


Sun,June 2, 2019 01:36 AM

Modi-Kulfi
ప్రధాని మోడీ క్రేజ్‌ను వ్యాపారులు భలే సొమ్ము చేసుకుంటున్నారు. మోడీ పేరు, ఫొటోలతో తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా సూరత్‌కు చెందిన ఓ ఐస్‌క్రీమ్ పార్లర్ మోదీ రూపంలో కుల్ఫీ తయారు చేసింది. దానికి నరేంద్ర మోదీ సీతాఫల్ కుల్ఫీ అని పేరు పెట్టింది. ఈ కుల్ఫీని యంత్రాలతో కాకుండా చేతులతో తయారు చేయడం గమనార్హం. 24 గంటల వ్యవధిలో మొత్తం 200 కుల్ఫీలను తయారు చేసింది. 50 శాతం డిస్కౌంట్‌తో ఈ కుల్ఫీని విక్రయిస్తున్నది ఆ పార్లర్. వంద శాతం సేంద్రియ ఉత్పత్తులతో దీనిని తయారు చేశారట. దీంతో వీటిని కొన్నవారు మోడీ కుల్ఫీతో సెల్ఫీ అంటూ ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు.

436
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles