నర్మద పరిక్రమ


Fri,May 31, 2019 01:17 AM

డైమండ్ నెక్లెస్ మాయం!
(గత సంచిక తరువాయి)
narmada2
మరో సందర్భంలో ఓ సాధువు వెళుతుంటే అతన్ని ఆపి వెతికారు. అతని దగ్గర సంచీలో ఇంకో జత బట్టలు తప్ప మరేం లేవు. అతణ్ని డబ్బు ఎక్కడ దాచావని అడిగితే తన దగ్గర డబ్బు లేదని ఆ సాధువు చెప్పాడు. అతణ్ని వెళ్లమని ఓ భిల్లు వెనుక నుంచి బాణాన్ని అతని కుడికాలి పిక్కమీదకు వేశాడు. కిందపడ్డ ఆ సాధువు ఎందుకు కొట్టావని అడిగితే, నువు అబద్ధం చెప్పావు కాబట్టి అని, అతని తలమీది శిఖని విప్పితే లోపల డబ్బుంది!

ఇంత రహస్యంగా దాచుకొన్నాను. మీకెలా తెలసింది ఇది? అని అతను ఆశ్చర్యపోయి అడిగితే, నర్మదా మాత క్రితం రాత్రి మాకు కలలో కనబడి శిఖతో వెళ్లే సన్యాసి శిఖలో డబ్బు ఉంటుందని చెప్పిందని వాళ్లు చెప్పారు. వాళ్లు వాడే బాణాల చివర పదునైన యం.ఎస్. బ్లేడ్లు ఉంటాయి. ఆ సన్యాసిని తమ గుడిసెలో ఉంచుకొని, అతని కాలి గాయం నయం అయ్యేదాకా వాళ్లు వనమూలికలతో కట్లు కట్టి, పోషించి, తర్వాత పంపించారు.

తీర్థయాత్ర

narmada5

ఏకలవ్యుడు ఈ భిల్లుజాతికి చెందినవాడు కాబట్టి, భిల్లులు ధనుర్బాణాలను వాడేటప్పుడు బొటనవేలును ఉపయోగించకుండా చూపుడువేలు, మధ్యవేళ్లను మాత్రమే ఉపయోగించి బాణాన్ని ప్రయోగిస్తారు. చిన్నప్పటి నుంచే వారి పిల్లలకు ఇందులో తగిన శిక్షణ ఇస్తారు. వారు వేసే బాణం వంద అడుగుల దూరంపైనే వెళుతుంది. సాధారణంగా వారి బాణం గురి తప్పదు. ఎంపిక చేసి, తగిన శిక్షణను ఇచ్చి ఒలింపిక్స్‌కు పంపితే వీరికి బంగారు పతకాలు రావడం తథ్యం.

నర్మద పరిక్రమ ధ్యేయంగా..

దేశాయ్ కాలి నడకన పరిక్రమ చేసినప్పుడు ఆంధ్రపదేశ్ (ఉమ్మడి) హైకోర్టుకు చెందిన ఓ జడ్జి తారస పడ్డాడు. ఆయన ఓ నేరస్థుడికి హంతకుడిగా శిక్ష విధించాడట. తర్వాత అతను అమాయకుడని ఆ జడ్జికి తెలిసింది. దాంతో పశ్చాత్తాపం కలిగి తన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఎవరి సలహా మీదో నర్మద పరిక్రమకు వచ్చానని చెప్పారట. నర్మద పరిక్రమ వల్ల మనిషిలోని పాపం, మోహం తొలగి, వైరాగ్యం పెరుగుతుందని విశ్వాసం.

ప్రాపంచిక వస్తువులు లేకుండా కూడా తాము జీవించగలమనే విషయాన్ని పరిక్రమ వాసులకు బోధించడానికై భిల్లులు వాళ్లను దోచుకొనే ఆచారం ఎన్నో వేల సంవత్సరాలుగా వస్తున్నది. దీన్ని ఎదుర్కొని పరిక్రమ వాసులకు సహాయం చేయడం కోసం ఈ భిల్లులు నివసించే ప్రాంతం ప్రవేశానికి ముందు ఓ చోట ఒక జైనసంస్థ, పరిక్రమ వాసుల దగ్గర ఉన్న విలువైన వస్తువులను తీసుకొని, సీనా రేకు డబ్బాలో వాటిని భద్రపరిచి, వారు ఈ ప్రమాదకర గ్రామాలు దాటాక ఆ డబ్బును తమ కలెక్షన్ సెంటర్‌లో ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేసింది. భిల్లుల చేతుల్లో దోచుకోబడ్డ వాళ్లకు కంబళ్లు, దుస్తులు కూడా ఆ సంస్థ ఉచితంగా ఇస్తుంది. ఈ భిల్లులకు భయపడని వారు తమ దగ్గర ఏమీ ఉంచుకోని నిజమైన విరాగులు మాత్రమే. ఒక్క వైరాగ్యమే భయం లేని స్థితిని ఇస్తుందని చెప్పిన భర్తృహరి మాటలు ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవచ్చు. ఆలోచిస్తే, ఈ ప్రపంచంలో వేలాది వాటిమీద ఏర్పరచుకొన్న మానసిక బంధాల వల్లే మనం భయాందోళనలకు గురవుతుంటామని ఈ కింది రెండు సందర్భాలు తెలియజేస్తాయి.

మల్లాది వెంకట కృష్ణమూర్తి

narmada4

ఓ అందమైన యువతి నర్మద పరిక్రమలో స్నానానికి వెళుతూ తన డైమండ్ నెక్లెస్‌ను అక్కడ ఉన్న చెట్లలోని ఓ చెట్టుతొర్రలో దాచుకొని వెళ్లింది. నదిలో స్నానం చేశాక తన నెక్లెస్ దాచిన చెట్టుకోసం వెదికింది. కానీ, అక్కడ ఉన్న అనేక వందల చెట్లలో ఏ చెట్టుకి వున్న తొర్రలో అది దాచిందో అర్థం కాలేదు. వెదికితే ఏ చెట్టుకీ తొర్ర కనబడలేదు. ఇక అది పోయిందని ఆమె గ్రహించింది. డైమండ్స్ ఆర్ ఫరెవర్ అని ఇంగ్లీషులో ఓ సామెత ఉంది. ఆమె శాశ్వతం అనుకొన్న డైమండ్ నెక్లెస్ పోయింది.

ఇలాగే, ఓ బ్రాహ్మణుడు నర్మద పరిక్రమలో రెండు రోజులుగా ఆకలితో నకనక లాడసాగాడు. అలాంటి యాత్రికులకు భోజనం పెట్టడానికి అన్నీ వండి సిద్ధంగా ఉంచి ఎదురుచూస్తున్న ఓ దంపతులు అతన్ని చూసి, భోజనానికి ఆహ్వానించారు. అతను ఆత్రంగా వెళ్లి కడుపు నిండా భోజనం చేశాడు. తర్వాత అతనికి వారు ఇచ్చిన తాంబూలంలో వాడిన దినుసులను చూశాక అనుమానం వచ్చి అడిగితే వారు ముస్లిమ్‌లు అని తెలిసింది. అతను నివ్వెరపోయాడు. ముస్లిమ్‌ల చేతివంట తిన్న తాను నాది అనుకున్న బ్రాహ్మణత్వం మంట కలిసి పోయినందుకు బాధపడ్డాడు.

ఇంత రహస్యంగా దాచుకొన్నాను. మీకెలా తెలసింది ఇది? అని అతను ఆశ్చర్యపోయి అడిగితే, నర్మదా మాత క్రితం రాత్రి మాకు కలలో కనబడి శిఖతో వెళ్లే సన్యాసి శిఖలో డబ్బు ఉంటుందని చెప్పిందని వాళ్లు చెప్పారు.

394
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles