జ్ఞానసాధనకు మార్గం


Fri,May 31, 2019 01:16 AM

Jeevana-vedam
మానవులు ఎప్పుడూ ఉన్నత స్థానం వైపే తమ ప్రయాణాన్ని సాగించాలి. దిగువ వైపు వెళ్లకూడదు. వైద్యులు, బోధకులు ప్రజలకు కావలసిన శక్తిని ప్రసాదిస్తారు. శరీరమనే రథాన్ని అధిరోహించి శాశ్వతమైన జ్ఞానసాధన దిశగా మీ ప్రయాణాన్ని సాగించాలి. దానిని ఇతరుల అనుభవం ద్వారా కూడా పొందవచ్చు. ఎప్పుడూ అధర్మమార్గాన్ని అవలంభించ కూడదు. వేదాలను సప్రామాణికంగానే స్వీకరించాలి. ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రుల బాటను వదలకూడదు. హీనమైన మార్గాలవైపు వెళ్లకూడదు. ఇంద్రియాలకు బానిసలు కాకుండా దివ్యజీవనం వైపు అడుగులు వేయాలి. దుర్మార్గుల అక్రమాలు, అన్యాయాలను సమర్థించవద్దు. విద్వాంసులు, సమాజానికి మేలు చేసేవారి సాంగత్యాన్ని అనుసరించాలి. కష్టాలు, కన్నీళ్లతో బాధపడే వారిని ప్రథమంగా ఆదుకోవడాన్ని మీ బాధ్యతగా గుర్తెరగాలి.
-అధర్వవేదం

143
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles