మసాలాలే జీవనాధారం!


Mon,May 27, 2019 01:40 AM

భారతదేశం సంప్రదాయ రుచులకు ఎంతో ప్రఖ్యాతిగాంచింది. మన రుచులకు విదేశీయులు సైతం ఫిదా అయిన సందర్భాలూ ఉన్నాయి. అంతటి రుచికరమైన వంటకాలకు సంప్రదాయ మసాలాలే కారణం. అందుకే ప్రత్యేకమైన మసాలాలను తయారుచేస్తున్నారు ముంబైకి చెందిన కొందరు మహిళలు.
mumbai-food-traditional
భారతదేశంలో అంతరించి పోతున్న సీసా మసాలాలకు జీవం పోస్తున్నారు ముంబైకి చెందిన గృహిణులు. ఎటువంటి రసాయనాలు లేకుండా గాజు సీసాలో మసాలాలను తయారు చేస్తున్నారు. ముంబై ప్రాంతంలోని కొంకణీ కమ్యూనిటీలో ఆంగ్లేయుల ప్రభావం ఏమాత్రం చూపలేకపోయింది. అందుకే వారి కమ్యూనిటీలో సంప్రదాయ మసాలాలనే ఇప్పటికీ వాడుతున్నారు. రుచికరమైన వంటకాలు తయారు చేసుకోవడంతో పాటు, ఆరోగ్యంగా ఉండేందుకు ఈ మసాలాలనే వినియోగిస్తున్నారు. ఈ మసాలాలను రూపొందించడానికి 25 నుంచి 60 రకాల సుగంధద్రవ్యాలను వాడుతారు. ఇటువంటి మసాలాలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీనిని ఎండా కాలంలో మాత్రమే తయారు చేస్తారు. పలు రకాల దినుసులను మూడురోజుల పాటు ఎండలో ఎండబెట్టి వాటిని కట్టెల పొయ్యిపై వేయించి, రోకలితో దంచుతారు. అలా దంచిన మసాలా మిశ్రమాన్ని ఓ గాజు సీసాలో ఉంచుతారు. అలా ఉంచిన ఆ మసాలాను ఏడాదంతా ఉపయోగించుకుంటారు.

గాజు సీసాలో ఉంచడం వల్ల చెడిపోకుండా ఉంటుంది. ఇలా రూపొందించిన మసాలాలు చికెన్, మటన్, చేప వంటి మాంసాహార వంటకాల రుచిని మరింతగా పెంచుతాయని ముంబైకి చెందిన అబ్రియా అనే గృహిణి చెబుతున్నది. 40ఏండ్ల నుంచి సీసా మసాలాలను తానే స్వయంగా చేసుకుంటుందట. ప్రతీ ఏటా 30కిలోల మసాలా తయారు చేసి కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలకు పంపిస్తున్నది అబ్రియా. తూర్పు ముంబైకి చెందిన ఎంతోమంది గృహిణులు సీసా మసాలాలు తయారు చేసి దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తూ ఓ పక్క ఆదాయాన్ని ఆర్జిస్తూనే, మరోపక్క తమ సంప్రదాయ మసాలాలకు జీవం పోస్తున్నారు.

1240
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles