బొప్పాయితో చర్మకాంతి


Mon,May 27, 2019 01:39 AM

జీవన విధానంలో మార్పులు, ఆహార అలవాట్లు, కాలుష్యం, రేడియేషన్, మొబైల్ లేదా గ్యాడ్జెట్ స్క్రీన్‌లకు ఎక్కువగా ప్రభావితమవడం వంటి కారణాల వల్ల చర్మం
పెళుసుగా తయారవుతుంది. ముఖంపై మొటిమలు, మృత కణాలు పేరుకుపోతాయి. వీటన్నింటికీ ఇంటి వద్దే పరిష్కారం దొరుకుతుంది. అదెలాగంటే..

face-pack
-బొప్పాయిలో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు చర్మాన్ని మృదుత్వం చేసి, మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడతాయి. రోజూ బొప్పాయిని తినడం వల్ల పెలుసుగా ఉన్న చర్మం కూడా మృదువుగా మారుతుంది.
-ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జును తీసుకుని, దానిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని నల్లమచ్చలపై రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా నెల రోజులు చేస్తే నల్ల మచ్చలు మాయమవుతాయి.
-పాల మీగడ, బొప్పాయి గుజ్జు ఒక్కో టీస్పూన్ తీసుకుని, కాస్తంత పసుపు వేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే చర్మ సౌందర్యం పెరుగుతుంది. ముఖంపై పడిన ముడతలు పోతాయి. ముఖ వర్ఛస్సు పెరుగుతుంది.
-అరటిపండు, బొప్పాయి ముక్కలను మెత్తని గుజ్జులా చేసి ముఖానికి రాసుకుని, పావుగంట తర్వాత చన్నీళ్లతో కడిగేయాలి. ఇది ఎండ వల్ల కమిలిన చర్మానికి చక్కటి పరిష్కారం. నాలుగైదు బాదం గింజలను రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయాన్నే మెత్తగా చేసి చెంచా బొప్పాయి గుజ్జు కలిపి ముఖానికి పూస్తే ముఖం తాజాగా కనిపిస్తుంది.
-చెంచా చొప్పున నారింజ రసం, బొప్పాయి గుజ్జు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి పావుగంట తర్వాత కడిగేయాలి. ఇది మచ్చలను తొలగించి ముఖాన్ని తాజాగా ఉంచుతుంది. చెంచా బొప్పాయి గుజ్జు, రెండు చెంచాల పచ్చిపాలు, చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పూర్తిగా ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే కమిలిన చర్మం మెరుస్తుంది.

1205
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles