చెత్తకోసం సీటు వదులుకుంది!


Mon,May 27, 2019 01:38 AM

మంచి యూనివర్సిటీలో సీటు సంపాదించాలని టార్గెట్ పెట్టుకుంటారు.ఆ తర్వాత బాగా చదివి.. మంచి ఉద్యోగం చేయాలనుకుంటారు. కానీ, ఈ అమ్మాయి వచ్చిన సీటుని వదులుకొని చెత్తని ఏరేస్తానంటున్నది.
garima
ఈమె పేరు గరీమా పూనియా. అమెరికాలోని ప్రెస్టీజియస్ యూనివర్సిటీ నుంచి డెవలప్‌మెంట్ స్టడీస్‌లో మాస్టర్స్ చేయాలనుకున్నది. అదృష్టవశాత్తు సీటు కూడా వచ్చింది. కానీ ఎంతగానో ఎదురుచూసిన సీటుని వద్దనుకున్నది. దీనికి కారణం వ్యర్థ పదార్థాలు. దీనికి చదువుకి సంబంధం ఏంటని తల్లిదండ్రులకు కూడా అర్థం కాలేదు. గరీమాని ఆరాతీస్తే 2017లో స్క్యూబా డైవింగ్ కోర్స్ కోసం తల్లిదండ్రులతో కలిసి నీల్ ఐలాండ్ చేరుకుంది. అక్కడున్న వ్యర్థ పదార్థాలు చూసి గరీమా గుండె తరుక్కుపోయింది. ఐలాండ్ అంతా చెత్తతో కూరుకుపోయింది. డైవింగ్ కోర్సు చేస్తున్న రోజుల్లో అక్కడున్న బీచ్‌లను గమనిస్తుండేది. ప్లాస్టిక్‌ను బీచ్‌కు దగ్గర్లో కాలుస్తుంటారు. పనికిరాని వ్యర్థ పదార్థాలు ఎక్కడ పడేయాలంటే బీచ్‌నే ఎంచుకుంటున్నారు. దీన్ని అరికట్టాలి. అందుకే యూనివర్సిటీలో వచ్చిన సీటును కాదనుకొని గరీమా తన జర్నీని కొత్తగా మొదలుపెట్టింది. బీచ్‌లని శుభ్రం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

బెన్ని జాకోబ్, ఎమెరాల్డ్ గెకో గరీమాకు అన్ని వసతులూ కల్పించారు. లాజిస్టికల్ కంపెనీ లోకల్ మ్యాగజైన్‌లో ఉద్యోగం ఇచ్చారు. వచ్చిన సంపాదనతో రెండు నెలలకోసారి రిసార్ట్, లోకల్ పంచాయత్, డైవింగ్ కమ్యూనిటికీ వెళ్లి జనాల్లో వ్యర్థ పదార్థాలపై అవగాహన కల్పిస్తున్నది. వర్క్‌షాప్‌లు కూడా నిర్వహిస్తున్నది. వినిత్ దోషి, గరీమాతో పాటు 33 మంది పిల్లలు పాల్గొని వంద కిలోల చెత్తను ఏరిపారేశారు. గరీమా చేపట్టిన కచెరెవాలె ప్రాజెక్ట్‌లో 80 మంది వలంటీర్లను చేర్చింది. ఐదు క్లీనప్ డ్రైవ్స్‌తో 200 కిలోల చెత్తని తీసేసినట్టు వలెంటీర్లు చెబుతున్నారు. గరీమాను చూసి అక్కడి ప్రజలు తడి, పొడి చెత్తని వేరుచేస్తున్నారు. అనుకున్న విధంగానే గరీమా, వలంటీర్లు కలిసి నీల్ ఐలాండ్‌ను శుభ్రం చేశారు. దీని తర్వాత టార్గెట్ హేవ్‌లాక్ ఐలాండ్. ఈ విధంగా చేసి తర్వాతి జెనరేషన్‌కి చెత్తలేని ఐలాండ్‌ను పరిచయం చేస్తానంటున్నది గరీమా.

1786
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles