స్పాండిలోలిస్థసిస్ ఎందుకు వస్తుంది?


Mon,May 27, 2019 01:35 AM

Councelling
మా నాన్న వయసు 65 సంవత్సరాలు. చాలాకాలంగా నడుమునొప్పితో బాధపడుతున్నాడు. కాళ్లు లాగడం, తిమ్మిర్లు వస్తున్నాయి. కొద్దిసేపు కూడా నడవలేడు. డాక్టర్‌కు చూపించాం. ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ స్కానింగ్ చేసి స్పాండిలో లిస్థసిస్ వ్యాధి అని చెప్పారు. ఆపరేషన్ ద్వారా సరిచేయవచ్చు అన్నారు. అసలు ఏంటీ సమస్య? ఎందుకు వస్తుంది? ఆపరేషన్ ఎలా ఉంటుంది? తెలుపగలరు.
- శ్రీనివాస్, హైదరాబాద్

వెన్నుపూసలు ఒకదాని మీద ఒకటి జరగడాన్ని స్పాండైలో లిస్థసిస్ అంటారు. ఇది రావడానికి చాలా కారణాలు ఉంటాయి. పెద్ద వయసు వారికి నడుములో డిస్క్‌లు, ఇతరత్రా భాగాలు అరిగిపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. చిన్న పిల్లల్లో పుట్టుకతో వెన్ను భాగంలో తేడావల్ల ఎముకలో గ్యాప్ ఏర్పడి ఈ సమస్య వస్తుంది. నడుముకు దెబ్బ తగలడం వల్ల కూడా కొందరిలో ఈ ఇబ్బంది రావచ్చు. దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉంటే మెడికల్ ట్రీట్మెంట్ వల్ల ఉపయోగం లేకపోవచ్చు. అలాంటప్పుడు ఆపరేషన్ ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. పక్కకు జరిగిన వెన్నుపూసలు కదలకుండా ఈ ఆపరేషన్ ద్వారా పరిష్కరించవచ్చు. మినిమల్లీ ఇన్వెస్టివ్ పద్ధతుల ద్వారా ఈ ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ తర్వాత కొద్దిరోజుల పాటు నొప్పి తక్కువగా ఉంటుంది. తర్వాత కొన్ని మెడిసిన్స్ వాడటం వల్ల కొద్దిరోజులకు దీనిని పరిష్కరించవచ్చు.
-డాక్టర్ జీపీవీ సుబ్బయ్య కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ కేర్ హాస్పిటల్స్, హైటెక్‌సిటీ

1334
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles