గింజలు పడేస్తున్నారా?


Mon,May 27, 2019 01:34 AM

మండుటెండలో పుచపండును తింటే ఆ అనుభూతే వేరు. వేసవిలో దప్పిక తీర్చడానికి దీనికి మించిన పండు లేదు. నీటి శాతం, వేడిని తగ్గించే గుణాలు ఇందులో అధికంగా ఉంటాయి. కానీ పుచ్చ గింజలు ఎందుకూ పనికి రావని పారేస్తుంటాం. అయితే పుచ్చగింజల్ని తింటే లాభాలు ఎన్నో ఉన్నాయి.
Watermelo
-పుచ్చపండు గింజల్లో విటమిన్స్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాపర్, జింక్, మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి. ఈ గింజల్లో ఉండే ఆమైనో ఆసిడ్స్ రక్తనాళాలను వెడల్పు చేసి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
-పుచ్చకాయ గింజలను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉండడం వల్ల శరీరంలో క్యాలరీలను శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. ఇందులో మోనోసాచ్యురేటెడ్, పాలీ అన్‌సాచ్యూరేటెడ్ ఫ్యాటీ ఆసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెకు ఆరోగ్యం అందించడంలోనూ సాయపడతాయి.
-పుచ్చపండులో ఉండే లైకోపిన్ అనే పదార్థం శరీరానికి మేలు చేస్తుంది. పుచ్చకాయ గింజలతో యాలకులను కలిపి తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి. యాలక్కాయలు సువాసనకే కాకుండా ఔషధంగా కూడా పనిచేస్తాయి. యాలక్కాయలు గజ్జి తదితర చర్మ రోగాలు తగ్గడానికి పనిచేస్తాయి.
-ఐరన్ సమృద్ధిగా ఉండడం వల్ల శరీరంలో క్యాలరీలను శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది.

4232
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles