కడుపు ఉబ్బరమా?


Sun,May 26, 2019 01:43 AM

stomoch
-మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం వల్ల ఒంట్లో నీరు ఉండిపోయి శరీరం ఉబ్బిపోతుంది. పొట్ట బాగా ఉబ్బి ఉండడం, మోకాళ్లు వాపు ఉండడం, జ్వరం రావడం లాంటి లక్షణాలుంటాయి. వీరు జీలకర్రను నీటిలో వేసి, రసం తీసి ఆ రసాన్ని ప్రతి రోజు మూడు పూటలా ఒక స్పూన్ చొప్పున తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
-మెంతుల్ని మెత్తగా పొడి చేసి పూటకు ఒక స్పూన్ చొప్పున తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. మెంతుల పొడిని ఒక స్పూన్ చొప్పున నీటితో కలిపి మింగాలి. ఇలా రోజుకు రెండుసార్లు తాగితే ఉబ్బరం తగ్గుతుంది.
-జీడి మామిడి పండ్లు మూడు తీసుకుని వాటి రసం ఒక కప్పులో పోసి ఒకే మోతాదుగా తాగాలి. రోజుకు రెండుసార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. పిప్పళ్లు బాగా దంచి, చూర్ణం చేసి దానిలో అరస్పూన్ చూర్ణానికి ఒక స్పూన్ నూనె కలిపి రోజూ మూడు పూటలా వాడుతుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
-జాజికాయ, జాపత్రి, శొంఠి, లవంగాలు, యాలకులు, చలవ మిరియాలు వీటన్నింటినీ సమభాగాలుగా తీసుకుని బాగా చూర్ణం చేసుకుని, జల్లించి అరస్పూన్ చొప్పున ప్రతి రోజు రెండు పూటలా తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
-ఒక పసుపు కొమ్మును ఒక కప్పు పాలల్లో వేసి దాన్ని బాగా మరగకాచి చల్లార్చి వడగట్టి ఆ పాలను ఉదయం సాయంత్రం తాగుతూ ఉంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ఒక గ్లాసు పాలు తీసుకుని అందులో కొద్దిగా నేల ఉసిరి ఆకులు వేసి బాగా మరిగించి ఆ పాలను వడకట్టి తాగితే మంచిది.

3189
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles