జుట్టు రాలుతున్నదా?


Sun,May 26, 2019 01:43 AM

జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తుంది. అందమైన ఆరోగ్యవంతమైన జుట్టున్న వారు ఆకర్షణీయులు. అలాంటి అందమైన కురుల కోసం మహిళలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఈ చిన్న చిట్కాలు పాటించి అందమైన,దృఢమైన జుట్టును సొంతం చేసుకోండి..
Hairfall
-ఉసిరికాయలను ముక్కలుగా చేసి బాగా ఎండబెట్టాలి. ఎండిన ఈ ముక్కలను కొబ్బరి నూనెలో వేసి వేడి చేసి ఒక రాత్రంతా ఉసిరి ముక్కలను నూనెలో ఉంచి, మరుసటి రోజు వాటిని తీసేసి ఆ నూనెను తలకు ఐప్లె చేసుకోవాలి. ఇలా నెలపాటు చేస్తే జుట్టు రాలిపోవడం తగ్గుతుంది.
-ఉసిరికాయలను మెత్తగా చేసుకుని కొద్దిగా రసం పిండి దానికి సమానంగా నిమ్మరసం జత చేసి ఈ మిశ్రమాన్ని షాంపూతో పాటు తలకు అప్లయ్ చేయాలి. తరువాత కొద్ది సేపు ఆగి తలస్నానం చేయాలి. ఇలా కొన్ని వారాలు చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
-ప్రతిరోజు కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి జుట్టుకు అప్లయ్ చేయాలి. దీని వల్ల మంచి నిగారింపు వస్తుంది. ఊడడం తగ్గుతుంది. కొత్తిమీర రసాన్ని తలకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే మంచిది.
-నిమ్మకాయ గింజలు, కొద్దిగా మిరియాలు కలిపి ముద్దగా నూరుకుని ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా క్రమంగా వారం పాటు చేస్తే మంచి ఫలితాలు చూడవచ్చు.

2469
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles