బరువెత్తాడు.. భళా అనిపించుకున్నాడు


Wed,May 22, 2019 01:11 AM

వెయిట్ లిఫ్టింగ్.. కష్టతరమైన ఆట. వందల కిలోల బరువును చేతులతో ఎత్తుతుంటే ఏదో యుద్ధ సన్నివేశాలను చూసినట్టే అనిపిస్తుంటుంది. అలాంటి క్లిష్టతరమైన వెయిట్‌లిఫ్టింగ్‌లో అంగవైకల్యం ఉన్న యువకుడు రికార్డు సాధించాడు.
Martin-Tye
అతను బ్రిటన్ మాజీ సైనికుడు. పేరు మ్టాన్ టై. సైన్యంలో ఉండగా ప్రమాదవశాత్తు అంగవైకల్యానికి గురయ్యాడు. అప్పట్నుంచీ ఇంట్లోనే ఉంటున్నాడు. మామూలుగా అతని కాళ్లు.. చేతులు పనిచేయవు. పట్టుమని పది కిలోల బరువు కూడా లేపవు. అలాంటిది మార్టిన్ ఏకంగా 505 కిలోల బరువును ఎత్తేసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. మార్టిన్ చిన్నప్పటి నుంచే బలిష్టంగా ఉండేవాడు. శరర దృఢత్వంపై చదువుకునే రోజుల్లోంచే ఆసక్తి ఉండేది. ఈ క్రమంలో సైన్యంలో చేరాడు. తర్వాత శరీరం సహకరించక రిటైర్ అయ్యాడు. శారీరకంగా కదలికల్లేకపోయినా మానసికంగా దృఢంగా ఉన్నాడు. 2017లో స్ట్రాంగ్‌మన్ అవార్డు కూడా పొందాడు. ఇటీవల జరిగిన డిఫరెంట్ ఏబుల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో 505 కిలోల బరువు ఎత్తి గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. సోషల్‌మీడియాలో ఇప్పుడు ఇతని వీడియోలు వైరల్ అవుతున్నాయి.

1103
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles