రోషిణి.. బహుముఖ కళాకారిణి!


Wed,May 22, 2019 01:11 AM

యోగా.. భరతనాట్యం.. స్కేటింగ్.. మూడు వేర్వేరు నేపథ్యం ఉన్న కళలు. ఈ మూడింట్లోనూ రాణిస్తూ బహుముఖ కళాకారిణిగా గుర్తింపు పొందింది హుబ్బాలికి చెందిన ఈ అమ్మాయి.
Roshini
రోషిణి పవార్ 21 సంవత్సరాల యువతి. కర్నాటకలోని హుబ్బాలి జేజీ కాలేజీలో బీకాం ఫైనలియర్ చదువుతున్నది. కాలేజీ ఏదైనా కార్యక్రమం జరిగితే రోషిణి పేరే గుర్తుకొస్తుంది అందరికీ. ఆమె ఒక ఇరవై నిమిషాల వ్యవధిలోనే తన ప్రతిభ ఏంటో చాటుతుంది. యోగాసనాలు వేస్తుంది. అంతలోనే భరతనాట్యంతో వావ్ అనిపిస్తుంది. వెంటనే స్కేటింగ్ పోటీల్లో ప్రతిభ చాటుతుంది. ఇలా ఇప్పటివరకు 500 ప్రదర్శనలు ఇచ్చి 174 బహుమతులు పొందింది రోషిణి. ఈ మూడింటినీ ప్రొఫెషనల్ మాస్టర్ల పర్యవేక్షణలో కోర్సు చేస్తుండటం గమనార్హం. ఇంత చిన్న వయసులో మూడు కళల్లో ఒకేసారి మెరుస్తూ అందరి ప్రశంసలూ అందుకుంటున్న ఆమెను ఎవ్వరైనా అభినందించాల్సిందే!

608
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles