ఆమె ఐశ్వర్యేనా?


Wed,May 22, 2019 01:11 AM

అందానికే అందం ఐశ్వర్యారాయ్. చాలారోజులకు ఆమె క్యాట్ వాక్ చేస్తూ దేవకన్యలా వస్తుంటే అందరూ డ్రెస్‌నే చూశారు. ఆమె చెవి రింగులేంటి? కనుబొమ్మల మేకప్ ఏంటి అని ఆసక్తిగా చూశారు.
Aishwarya-Rai
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఐశ్వర్య మెరిసింది కదా. తాజా ఈవెంట్‌లో అయితే ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేస్తూ కనిపించడంతో అభిమానులు.. ఫ్యాషన్ ప్రియులు ఆసక్తితో చూశారు. పొడవాటి కళ్లతో గౌను వేసుకొని ఆమె నడుస్తూ వస్తుంటే దేవకన్య వచ్చిన అనుభూతి పొందారు కొందరైతే. హోలోగ్రాఫిక్ గౌను వేసుకొని ప్రత్యక్షం అయ్యింది ఐశ్వర్య. ఆ గౌను ఈకలతో చేసిందిగా.. పొడవాటి రైలు మాదిరిగా కనిపించింది. డైమండ్‌లు పొదిగిన చెవి రింగులు వేసుకొని స్మోకీ ఐస్‌తో ఐశ్వర్య వచ్చి అందర్నీ ఐస్ చేసింది అంటూ సోషల్‌మీడియాలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఆమె క్యాట్‌వాక్ మరోసారి ట్రెండింగ్ అయింది.

1370
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles