మెమీస్ ప్రేమికుడు


Wed,May 22, 2019 01:11 AM

ఫేస్‌బుక్.. వాట్సప్ లాంటి సోషల్‌మీడియా సైట్లలో పోస్టులకు.. మెసేజ్‌లకు స్పందించాలి అనుకుంటాం. కానీ సమయం ఉండదు. పైగా రాసే ఓపిక కూడా లేదనుకోండి ఏం చేస్తారు? ఎమోజీలు పెడతారు. అంతేకదా?
Anuj-Nakade
ఎమోజీలు ఒక భావాన్ని మాత్రమే తెలుపుతాయి. కానీ మెమీస్ కొందరి భావాలతో కూడిన సన్నివేశాల్ని కళ్లముందు ఉంచినట్లు చూపిస్తాయి. అందుకే చాలామంది మెమీస్‌ను ఫాలో అవుతుంటారు. వీరప్పన్, బాహుబలి, సర్దార్ వంటి మెమీస్ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. వాటిని మనం ఆస్వాదిస్తూ ఉంటాం. అలాంటివాటిని చేసే ఒక యువకుడి గురించి తెలుసా? అతడే అనుజ్ నకాడే. బెస్ట్ ఇండియన్ మెమీస్ ఆర్టిస్ట్. పుణెకు చెందిన ఇతడు ఇటీవల ఎగ్జిబిషన్ పెట్టాడు. అందరూ ఫొటో ఎగ్జిబిషనేమో అనుకున్నారు. కానీ అతడు పెట్టింది మెమీస్ ఎగ్జిబిషన్ అని తెలిసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ ఎగ్జిబిషన్ పేరు అనుజ్ నకాడేస్ మెమీ రెజిమ్. తొలుత ముంబైలో తర్వాత బెంగళూరులో, ఆ తర్వాత మూసూర్‌లో ఎగ్జిబిషన్ పెట్టిన అనుజ్.. దేశంమొత్తం మెమీస్ ప్రదర్శన పెట్టాలని నిర్ణయించుకున్నాడు.

686
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles