కుక్కను ప్రేమించి.. గిన్నిస్ రికార్డు!


Wed,May 22, 2019 01:10 AM

పెట్ లవర్స్.. మనుషులతో సమానంగా వాటికి ప్రాధాన్యం ఇస్తూ ప్రేమనుచాటుతున్నారు. ఒక రకంగా ఫ్యామిలీ మెంబర్‌గా చూసుకుంటున్నారు. అలా కుక్కలపై ప్రేమను చాటి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కింది ఒకామె.
Mary-Elias
సిరియాకు చెందిన మేరీ ఇలియాస్ పెట్‌లవర్. కుక్కలన్నా.. వాటికి సంబంధించిన వస్తువులన్నా ఆమెకు ఎనలేని ప్రేమ. తన షాపింగ్ గుర్తుంటుందో లేదో తెలియదుగానీ.. ప్రతిరోజూ తనకు ఇష్టమైన కుక్క కోసం షాపింగ్ చేస్తుంటుంది. కొత్త కొత్త వస్తువులు కొంటుంది. అలా ఇప్పటివరకు ఆమె 1496 వస్తువులు కొన్నది. ఓ కుక్క కోసం ఇంత పెదమొత్తంలో వస్తువులను కొన్న ప్రపంచంలోనే మొదటి వ్యక్తి ఆమె కావడం విశేషం. తనకు కుక్కపై ఉన్న ప్రేమ ఎలాంటిదో నిరూపించుకోవడం కోసం పెద్దమొత్తంలో వస్తువులను కొన్నాను అని.. ఇది గిన్నిస్ రికార్డుల్లో ఎక్కడం ఆనందంగా ఉందని ఇలియాస్ పేర్కొంది.

2151
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles