బంగారం లాంటి చర్మం మీ సొంతం


Wed,May 22, 2019 12:39 AM

ప్రకాశవంతమైన, ఆకర్షణీయమైన చర్మ సౌందర్యం అనేది ప్రతి ఒక్కరి అభిలాష. కొందరు రసాయన క్రీముల్ని ఉపయోగిస్తుంటారు. మరికొందరు పాత కాలపు చిట్కాలు ఉపయోగిస్తుంటారు. రసాయన క్రీముల వల్ల చర్మానికి మంచి జరగడం అటుంచితే చెడు మాత్రం గ్యారెంటీ. ఇంట్లో దొరికే వాటితోనే చర్మ సంరక్షణ పొందండిలా..
face-pack
1. ఒక గిన్నెలో బంగాళా దుంప రసాన్ని తీసుకుని , దోసకాయ రసాన్ని కలపాలి. ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. వీటికి చిటికెడు పసుపు కలుపుకోవాలి. వీటిని ముఖంపై రాసుకోవాలి. 15 నిమిషాలు ఆరనిచ్చి చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. వరుసగా పదిహేను రోజులు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.

2. ముఖ్యంగా ఏ ఫేస్‌ప్యాక్ ఐప్లె చేయాలన్నా ముందుగా ముంజేతిపై కొంత మొత్తాన్ని ఐప్లె చేయాలి. మీ చర్మంపై ఎలాంటి రియాక్షన్ కలిగినా, ఆ ఫేస్‌ప్యాక్ వినియోగాన్ని ఆపడం మంచిది. ఏ ఫేస్‌ప్యాక్ వాడాలనుకున్నా ఈ పద్ధతి అనుసరించి 24 గంటలు పర్యవేక్షణ అవసరం.

3. తాజాగా పండిన స్ట్రాబెర్రీలను తీసుకుని గుజ్జు చేయాలి. అందులో 2 టీ స్పూన్ల పెరుగు లేదా యోగర్ట్ కలిపి మిక్సీ చేయాలి. ఆ తరువాత ముఖం మీద నెమ్మదిగా రాస్తూ మర్దన చేయాలి. 5 నుంచి పది నిమిషాలు అలాగే ఉంచి, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా ప్రతి రోజు చేస్తే జిడ్డు తొలిగిపోతుంది.

4. ఒక టీ స్పూన్ తేనెను 2 టీ స్పూన్ల పచ్చిపాలతో కలిపి మిశ్రమంగా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద రాసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత వెచ్చని నీటితో శుభ్రపర్చాలి. ముఖం జిడ్డుగా కాకుండా ఈ చిట్కా పనిచేస్తుంది.

5. పైనాపిల్ జ్యూస్‌లో 2 టీ స్పూన్ల నిమ్మరసం కలపండి. 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి మిశ్రమంలా చేసి ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత కడుక్కుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. పేరుకున్న మురికీ పోతుంది.

1695
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles