డిస్క్ ఆపరేషన్ వల్ల కాళ్లు పనిచేయవా?


Mon,May 20, 2019 02:08 AM

నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తాను. గత రెండు నెలల నుంచి నన్ను బ్యాక్‌పెయిన్ సమస్య వేధిస్తున్నది. దీంతోపాటు ఎడమకాలు నొప్పి కూడా ప్రారంభం అయింది. డాక్టర్‌ను సంప్రదించగా అన్ని రకాల పరీక్షలూ చేశారు. నా కాలు నొప్పిని సయాటికాగా చెప్పారు. సమస్య సాధారణంగానే ఉండటం వల్ల వారం రోజుల పాటు మెడిసిన్ వాడమన్నారు. మెడిసిన్ రెగ్యులర్‌గా వాడుతున్నా కానీ నొప్పి తగ్గలేదు. డాక్టర్ మరోసారి పరీక్షలు చేసి L5, S1 డిస్క్ పక్కకు జరిగి కాళ్లలోకి వచ్చే నరాలు ప్రెస్ అవుతున్నాయనీ.. దీనిని స్లిప్ డిస్క్ లేదా డిస్క్ ప్రొలాబ్స్ అంటారని చెప్పారు. అది కూడా పనిచేయక ఇప్పుడు ఆపరేషన్ ఒక్కటే పరిష్కారం అంటున్నారు. డిస్క్ ఆపరేషన్ వల్ల కాళ్లు చచ్చుబడిపోతాయని విన్నాను. ఇది నిజమేనా? నేను మళ్లీ మామూలుగా నడవగలనా? దయచేసి తెలుపగలరు.
- గగన్, హైదరాబాద్

Councelling
స్లిప్ డిస్క్ ప్రాబ్లెమ్ అనేది చాలామందిలో సర్వ సాధారణంగా ఉంటుంది. కాబట్టి మీరు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. 80-90% మందికి ఇది మెడికల్ ట్రీట్‌మెంట్‌తోనే తగ్గిపోతుంది. 10-20% మందికి ఇది తగ్గదు. అయితే ఈ మెడికల్ ట్రీట్మెంట్ అనేది 4-6 వారాలు మాత్రమే ఇస్తాం. దీని తర్వాత కూడా నొప్పి ఎక్కువగా ఉంటే మాత్రం ఆపరేషన్ తప్పనిసరి. మీరు చెప్పిన వివరాల ప్రకారం.. మీరు ఈ దశ కూడా దాటేశారు. ఇప్పుడు మీకు కచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిందే. మీరు భయపడినట్లు ఈ ఆపరేషన్ భయంకరమైంది కాదు. చాలా సురక్షితమైంది. ఆపరేషన్ చేయించుకుంటే కాళ్లు చచ్చుబడిపోతాయి అనే మీకున్న అపోహ చాలామందికి ఉంది. ఈ సర్జరీ కీ హోల్ పద్ధతిలో చేస్తారు. ఈ పద్ధతి ఉపయోగం ఏంటంటే.. ఈరోజు ఆపరేషన్ చేయించుకుంటే రేపట్నుంచే లేచి తిరగొచ్చు అన్నమాట. అలాగే తన పని తాను చేసుకోవచ్చు. ఆపరేషన్ తర్వాత ఈ సమస్య తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఏదో వందలో ఐదు శాతం మాత్రమే తిరిగి సమస్య వస్తుంది. కీ హోల్ పద్దతిలో ఎక్స్‌పీరియన్స్ ఉన్న మంచి స్పైన్ సర్జన్‌తో చికిత్స చేయించుకుంటే ఎలాంటి సమస్యలూ రావు. కాబట్టి మీరు నిశ్చింతగా ఆపరేషన్ చేయించుకోండి. ఎలాంటి ఆందోళన లేకుండా ఆరోగ్యవంతమైన జీవితం గడపండి.


-డా. జీపీవీ సుబ్బయ్య
-కన్సల్టెంట్ స్పైన్ సర్జన్
-కేర్ హాస్పిటల్స్, హైటెక్‌సిటీ

304
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles