తల్లిదండ్రుల త్యాగం


Mon,May 20, 2019 02:06 AM

అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండడంతో పిల్లల్ని దగ్గరుండి చదివించుకునే తల్లిదండ్రులు తెలుసు. కానీ, కొన్ని ప్రాంతాల్లో చదువు కోసం పిల్లల్ని 12 యేండ్లు దూరంగా ఉంచుతూ వారి రాకకోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారంటే నమ్ముతారా?
parents
నేపాల్‌లోని హిమాలయ పర్వత శ్రేణుల్లోని కొన్ని మారుమూల గ్రామాలకు ఇప్పటికీ రవాణా సౌకర్యాలు లేవు. ఆ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాలకు వెళ్లాలంటే సాహస యాత్ర చేయాల్సిందే. ఆ గ్రామాల్లోని తల్లిదండ్రులు పిల్లల చదువుకోసం పట్టణ ప్రాంతాలకు పంపిస్తున్నారు. చదువుకోసం వెళ్లిన వారు 12 యేండ్ల తర్వాత తిరిగి వస్తారు. ఈ మధ్యలో పిల్లలు గ్రామానికి రావడం గాని తల్లిదండ్రులతో మాట్లాడడం గాని జరుగదు. తల్లిదండ్రులు వాళ్లతో మాట్లాడే అవకాశం లేకపోవడంతో క్షోభకు గురవుతుంటారు. ఆ బాధనంతా గుండెల్లో దిగమింగుకొని పిల్లలు చదువు పూర్తి చేసుకొని విద్యావంతులుగా వస్తారనే ఆశతో ఎదురుచూస్తుంటారు అక్కడి తల్లిదండ్రులు. ఓ స్వచ్ఛంద సంస్థ కాట్మండ్‌లోని స్నోలాండ్‌లో ఒక స్కూల్ నడుపుతున్నది. పేద, గ్రామీణ పిల్లలకు ఈ పాఠశాల పూర్తి ఉచిత విద్య అందిస్తున్నది. గ్రామంలోని పిల్లలందరూ ఈ పాఠశాలలోనే చదువుతున్నారు. అక్కడి నుంచి ఇంటికి చేరాలంటే రెండు విమానాలు మారాలి. దాదాపు ఐదు రోజులు ట్రెక్కింగ్ చేయాలి. ఆ విధంగా చదువు పూర్తి చేసుకొని ఇంటికి చేరుకున్న విద్యార్థులు వారి తల్లిండ్రులను గుర్తుపట్టి పలకరించడంతో ఇన్నేండ్ల దూరం ఒక్కసారిగా దూరమైనట్లు ఉంటుందంటున్నారు.

259
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles