ఐడియా అదిరింది..


Mon,May 20, 2019 02:05 AM

ఇంట్లో పేరుకుపోయిన చెత్తతో పర్యావరణానికి హాని కలుగకూడదని ఆలోచించింది. ఆ ఆలోచన ద్వారా ఆరు కుటుంబాల్లో మార్పు వచ్చింది. అంతేకాదు.. వారు కొంత డబ్బును కూడా ఆదా చేస్తున్నారు. అదెలాగో చదువండి..
PRIYANKA-DEV
చెత్తను కవర్లల్లో నింపి ఊరి చివర్నో, పెంటకుప్ప మీదనో పడేస్తుంటాం. లేదంటే మున్సిపాలిటీ రిక్షాలోనో, చెత్త కుండీల్లోనే పడేస్తుంటాం. ఆ తర్వాత పర్యావరణానికి ఏం హాని జరిగినా మనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తాం. ఢిల్లీకి చెందిన ప్రియాంక దేవ్ గృహిణి. పర్యావరణ హితంగా ఏదైనా చేయాలనుకుంది. ఆరోజు సాయంత్రమే మార్కెట్‌కు వెళ్లి రెండు డబ్బాలు కొనుక్కొచ్చింది. తనతో పాటు స్థానిక ఆరు కుటుంబాల మహిళలతో కొనిపించింది. ఆరు కుటుంబాలకు కలిపి 80 శాతం తడి చెత్త పోగయ్యింది. దాంతో ప్రత్యేకంగా గోబర్ గ్యాస్ తయారు చేసి ఆరు కుటుంబాలు వాడుకునేలా ప్రియాంక ఏర్పాటు చేసింది. నెల నెలా ఆరు కుటుంబాలకు కలిపి రూ.2800 ఖర్చయ్యే గ్యాస్‌ను ఉచితంగా అందిస్తున్నది. అంతే కాకుండా వారంతా రసాయనాల డిటర్జెంట్లు, క్లీనింగ్ పౌడర్‌లు కూడా వాడడం మానేసేలా చేసింది. అప్పటి నుంచి వాడిపడేసిన నారింజ తొక్కలతో వారంతా ఫ్లోర్ క్లీన్ చేస్తున్నారు. వెనిగర్, బేకింగ్ సోడాతో టాయిలెట్‌ను క్లీన్ చేస్తున్నారు. ఇలా ప్రియాంకకు వచ్చిన పర్యావరణహిత ఆలోచన ఆరు కుటుంబాల్లో ఎంతో డబ్బును ఆదా చేసేలా చేస్తున్నది. ఇప్పుడు ఆమె ఉంటున్న వీధిలో అందరూ ఇదే పంథాలో డబ్బును ఆదా చేయాలని, పర్యావరణానికి మేలు చేయాలని అనుకుంటున్నారు.

300
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles