పిల్లల దగ్గర ప్రస్తావించొద్దు!


Mon,May 20, 2019 02:04 AM

పిల్లలు ఎదిగే కొద్ద్దీ వారికంటూ ఒక వ్యక్తిత్వం ఏర్పడుతూ ఉంటుంది. ఆ వ్యక్తిత్వానికి నిర్మాతలు తల్లిదండ్రులే. పిల్లలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతారో, తరచూ ఎలాంటి సందర్భాలు ఎదుర్కొంటారో అవే అంశాలు వారిపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లల దగ్గర కొన్ని విషయాలు ప్రస్తావించవద్దు.
parenting
-7 నుంచి 18 ఏళ్ల మధ్య పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ల ఫీలింగ్స్ హర్ట్ అవ్వకుండా జాగ్రత్తపడాలి. వాళ్లకు నెగెటివ్ ఇంపాక్ట్ పెరుగకుండా జాగ్రత్తపడాలి. ఇంట్లో ప్రశాంత వాతావరణం అలవర్చాలి.
-తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో పిల్లలు తమ మాట విననప్పుడు ఆగ్రహానికి లోనై.. లీవ్‌మీ ఎలోన్ అంటూ ఉంటారు. తరచూ వాళ్లను దూరం పెడుతూ ఉంటే వాళ్లు అభద్రతా భావం వారిలో బలపడుతుంది. అలాంటప్పుడే వారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతారు. నలుగురిలోనూ కలువలేకపోతారు.
-పిల్లలను తిట్టేటప్పుడు వాళ్లు నిరాశాభావంలోకి వెళ్లిపోతారు. లేదా ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి సమయాల్లో వాళ్లు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. వాళ్లను ఎప్పుడూ తక్కువగా అంచనా వేస్తూ, ఎందుకూ పనికి రావని తిట్టకూడదు. ఇలా తిట్టడం వల్ల తామెందుకూ పనికిరామనే భావనలోనే కాలం వెళ్లదీస్తారు.
-చీటికీమాటికీ ఇతర పిల్లలతో పోల్చడం అనేది వారిలో ఆత్మైస్థెర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి పోల్చడం మానేసి వారికి అర్థమయ్యేలా ఒక పని గురించి ప్రయోజనాలు, దుష్పరిణామాలు వెల్లడించాలి. ఇలా నాలుగైదు సందర్భాల్లో వారికి వివరించగలిగితే వారు తప్పు చేయకుండా ఉంటారు.
-కొంత మంది పేరెంట్స్ పిల్లల్లో ఒక భావనను బలంగా నాటుతారు. నువ్ ఆడపిల్లవు, నువ్ మగాడివి ఇలా చేయకూడదు అని. అమ్మాయిలైనా అబ్బాయిలైనా స్వతంత్రంగా ఉండాలని, ఇద్దరూ సమానమేనని వివరించాలి.

318
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles