పక్షుల కోసం లక్షల ఖర్చు


Sun,May 19, 2019 01:09 AM

పక్షులు బతకాలంటే వాటికి అనువైన వాతావరణం అవసరం. అడవులు అంతరించడం, చెట్లు కనుమరుగు అవుతుండడంతో పక్షులకు ఆహారం కరువైంది. నిలువ నీడ, ఆహారం లేక ఎన్నో పక్షిజాతులు అంతరిస్తున్నాయి. దీంతో పక్షుల సంరక్షణకు ఈ వ్యక్తి శ్రీకారం చుట్టాడు.
kerala-man-spends-lakhs
అంతరించిపోతున్న పక్షి జాతులను బతికించుకునేందుకు ఈ వ్యక్తి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. కేరళలోని ఎర్నాకులం జిల్లా ముప్పదడం గ్రామానికి చెందిన శ్రీమాన్ నారాయణన్ పక్షుల సంరక్షణే ధ్యేయంగా సేవ చేస్తున్నాడు. నారాయణన్ ఓ రెస్టారెంట్ యజమాని. ఆయన సంపాదనలో అత్యధికంగా సమాజసేవ చేయడానికే కేటాయిస్తున్నాడు. ఇక పక్షుల కోసం ప్రత్యేకంగా మొక్కలు నాటాడు నారాయణన్. ఆ మొక్కల బాధ్యతను కొందరు వ్యక్తులకు అప్పగించాడు. ఎర్నాకులం జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటికీ వెళ్లి.. మట్టి పాత్రలు ఇచ్చి పక్షుల దాహార్తిని తీర్చమని కోరుతున్నాడు. పర్యావరణాన్ని రక్షించేందుకు గాంధీజీ సూత్రాలను, జీవిత చరిత్రను జనాలకు తెలిపేందుకు 5 వేల కాపీలను ముద్రించి పంపిణీ చేశాడు. ఇప్పటి వరకు ఎర్నాకులం జిల్లా వ్యాప్తంగా 50,000 మొక్కలను నాటాడు నారాయణన్. ఈ మొక్కల కోసం దాదాపు రూ.15లక్షలు వెచ్చించాడు. పక్షలు దాహార్తిని తీర్చేందుకు రూ.8 లక్షలతో 10వేల మట్టి పాత్రలను ఏర్పాటు చేయించాడు. కేవలం పక్షుల ఆలన, పాలన కోసం దాదాపు రూ.23 లక్షలు ఖర్చు చేస్తూ అందరి ప్రశంసలూ అందుకుంటున్నాడు.

294
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles