ఆన్‌లైన్‌లో ఆప్యాయంగా..


Sun,May 19, 2019 01:08 AM

ఏడు పదులు దాటిన వారంతా సామాజిక మాధ్యమాల ద్వారా తమ బంధువులు, స్నేహితులను పలుకరించుకుంటూ సంతోషంగా గడుపుతున్నారు. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతున్నట్లు మానసిక నిపుణులు చెబుతున్నారు.
Grandpas-Social-Media
వృద్ధ్దులు- సోషల్ మీడియా వినియోగం అనే అంశంపై ఏజ్‌వెల్ ఫౌండేషన్ ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలో ఉన్న వృద్ధులు సామాజిక మాధ్యమాలతో కాలక్షేపం చేయడంతోపాటు, వారి బంధువులతో ఆన్‌లైన్‌లో ఆప్యాయంగా గడుపుతున్నారు. ఇలా చేయడం వల్ల వారిలో ఆందోళన, ఒత్తిడి తగ్గి, 20 శాతం మంది వృద్ధులు సంతోషంగా ఉన్నారట. సోషల్ మీడియాను 2009లో 65 ఏండ్లు పైబడిన వారు 4 శాతం మంది వినియోగించగా, 2011లో వారి శాతం ఏకంగా 150 శాతానికి పెరిగింది. సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సీనియర్ సిటిజన్‌లు తమ సమస్యలను మర్చిపోయి ఎక్కువ సమయాన్ని ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లతోనే గడుపుతున్నారు. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉన్న తమ మనవళ్లు, మనవరాళ్లతో చాటింగ్ చేస్తూ, వీడియో కాల్స్ చేస్తూ బాగోగుల గురించి తెలుసుకుంటున్నారు. వారి మధ్య పెరిగిన దూరాన్ని భౌతికంగానే భావిస్తున్నారు. మానసికంగా మాత్రం వారు చాలా దగ్గరవుతున్నారు. సోషల్ మీడియాను ఓ మిత్రుడిగా భావిస్తూ దాంతోనే సంతోషంగా గడుపుతున్నారు.

212
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles