15 గొర్రెలకు స్కూల్ అడ్మిషన్


Sun,May 19, 2019 01:08 AM

కొన్ని దేశాల్లో నిబంధనలు స్ట్రిక్ట్‌గా ఉంటాయి. వాటికి ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత కూడా అధికంగా ఉంటుంది. ఫ్రాన్స్‌లో కేవలం 15 మంది విద్యార్థులు తక్కువున్నారని ఆ కోర్సునే ఎత్తివేయాలనుకున్నారు అధికారులు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చేశారో తెలుసా?
france-school
మన దగ్గర విద్యార్థులు తక్కువగా ఉంటే పాఠశాలల్ని మూసేస్తారు. అదే మాదిరిగా ఫ్రాన్స్‌లోనూ ఆ విధానం కొనసాగుతున్నది. అక్కడి ఆల్ఫ్స్ పర్వత శ్రేణుల్లోని క్రెట్స్ ఎన్ బెల్లెడొన్నే అనే పట్టణంలోని కళాశాలలో 11వ తరగతిలో 226 మంది విద్యార్థులు ఉండేవారు. అయితే ఇటీవల 15 మంది పిల్లలు బడి మానేశారు. దీంతో అక్కడి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఇదే అదునుగా అక్కడి అధికారులు 11 వ తరగతిని ఎత్తివేస్తామని తేల్చి చెప్పారు. అందుకు నిరసన వ్యక్తం చేస్తూ స్థానిక రైతు మైఖేల్ గిరెర్డ్ తన 15 గొర్రెలను తీసుకెళ్లి పాఠశాలలో చేర్పించాడు. వాటికి బా-బెటె, డాల్లీ, షావున్ వంటి పేర్లు పెట్టి స్కూలు రికార్డుల్లో నమోదు చేయించాడు. ఈ గొర్రెలకు స్థానిక మేయర్ గాయెల్లే లావల్ జనన ధ్రువీకరణ పత్రాలు కూడా జారీ చేశాడు. అనంతరం పాఠశాల ఆవరణలో గొర్రెల మందను తోలుకొచ్చి మేం గొర్రెలం కాదు విద్యార్థులం అంటూ ప్లకార్డులు పట్టుకుని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నినదించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

336
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles