12 గంటలు.. 66లక్షల మొక్కలు!


Sun,May 19, 2019 01:07 AM

హరితహారం తెలంగాణలో విజయవంతం అయి ఇతర రాష్ర్టాలకు ఆదర్శం అయింది. ఇప్పుడు దేశమంతటా మొక్కలు నాటే కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకున్నారు.
trees
గొప్ప ప్రణాళిక కార్యాచరణగా రూపొంది విజయవంతం కావాలంటే దాని వెనుక ఎంతో కృషి ఉండాలి. ఓడిపోతామేమోనని ప్రారంభిస్తే ప్రయత్నంలోనే తడబాటు ఎదరవుతుంది. మనిషి తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఈ విషయాన్ని మరోమారు వారు రుజువు చేశారు. మధ్యప్రదేశ్‌కు ప్రజలు చరిత్ర సృష్టించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో వరల్డ్ రికార్డుల్లో కెక్కారు. 15లక్షల మంది వలంటీర్లు 66 లక్షల మొక్కలను నాటారు. నర్మద నది ఒడ్డున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2016 జూలైలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎనిమిది లక్షల మంది వలంటీర్లు ఐదు కోట్ల మొక్కలను నాటారు. మధ్యప్రదేశ్‌లో మొక్కలు నాటిన తర్వాత అక్కడి ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ గర్వంగా ఉందని ప్రకటించాడు. ఆరు కోట్ల అరవై మూడు లక్షల మొక్కలు నాటిన మొదటి రాష్ట్రంగా అవతరించింది. ప్రకృతిని కాపాడేందుకు మనుషులుగా మనవంతుగా ఎంతో కొంత మేలు చేయాలనే తలంపుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భవిష్యత్ తరాల కోసం ఇది చాలా లాభం చేయనున్నది.

351
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles