కాలం ఆమెకు విజయం బాకీ పడింది!


Sun,May 19, 2019 12:46 AM

లక్ష్య సాధనలో ఎన్నో కష్టాలుంటాయి, అడ్డంకులుంటాయి అన్నిం టిని ధైర్యంగా ఎదుర్కోవడమే మన పని. పేదరికం వెంటాడినా, ప్రోత్సాహం కరువైనా కలల సాధన కోసం కష్టపడడమే అంతిమ విజయానికి దారి తీస్తుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో కష్టపడుతున్నది రాంచీకి చెందిన బేబీ ఝూ అనే అమ్మాయి.
baby
ఆమె ఉన్నతంగా కలలు కన్నది. కానీ కావాల్సిన అనుభవం ఆమె దగ్గర లేదు. అందుకోసం ఆమె ఆరేండ్లుగా కష్టపడుతున్నది. రాంచీకి చెందిన బేబీ రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీల్లో బైక్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో పని చేయాలని లక్ష్యం పెట్టుకుంది. ఆ పని కోసం సర్టిఫికెట్లు, అనుభవం అవసరమని కంపెనీ తేల్చి చెప్పింది. ఐఐటీ చేసిన వాళ్లకే ఇలాంటి ఉద్యోగావకాశాలు ఉంటాయని కంపెనీ బేబీని తిరస్కరించింది. ఆమెది చాలా పేద కుటుంబం. తండ్రి ఆటో డ్రైవర్. ఐఐటీ చదివించే స్థోమత లేదు. దీంతో ఆమె స్థానికంగా ఓ రిపేరింగ్ షెడ్డులో బైక్ మెకానిక్‌గా చేరింది. సుమారు ఆరేండ్ల నుంచి బైక్ రిపేర్ చేస్తుంది. ప్రత్యేకంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బండ్లను రిపేర్ చేస్తుంది. బుల్లెట్ బండిని నడపడం దగ్గర నుంచి ఇంజిన్‌ను బాగు చేసే వరకూ అన్ని పనులూ చేస్తుంది. నాకు బుల్లెట్ కంపెనీలో పని చేయడం ఇష్టం. కానీ అందుకోసం ఐఐటీ కావాలన్నారు. అది చదవాలంటే 40 నుంచి 50 వేలు ఖర్చు అవుతుంది. అంత ఆర్థికంగా మా కుంటుంబం లేదు. అందుకే చిన్న షెడ్డులో పని చేస్తూ జీవనం సాగిస్తున్న అని అంటున్నది బేబీ. తన కన్న కల నెరవేరకపోగా నిరాశ చెందలేదు. ఆమె పరిధిలో ఆమె పనులు చేస్తున్నది. ఎప్పటికైనా ఆమె తన లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆశిద్దాం.

175
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles