మృదువైన చర్మం కోసం..


Sun,May 19, 2019 12:45 AM

skincare
-వేపనూనె, నిమ్మరసాన్ని బాగా కలిపి చర్మానికి ఐప్లె చేయాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఈ రెండింటితో ప్రతిరోజూ ఫేషియల్ చేసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకోండి.
-వేపనూనె, నిమ్మరసం రెండింటినీ కలుపడం వల్ల దీంట్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది. దీంతో చర్మంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
-వేపనూనె, నిమ్మరసంతో పాటు కాస్త తేనెను జోడించాలి. ఈ కాంబినేషన్ చర్మంలోని కొల్లాజెన్‌ను నివారిస్తుంది. చర్మంపై ముడుతలు కనబడకుండా చేస్తుంది.
-నీమ్ ఆయిల్, నిమ్మరసం కాంబినేషన్ ఒక బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల స్కిన్‌టోన్ మెరుగుపడుతుంది. చర్మంపై వృద్దఛాయలు కనబడకుండా చేస్తుంది. స్కిన్ పిగ్మెంటేషన్ నివారించడంలో చక్కగా సహాయపడుతుంది.
-వేపనూనె, నిమ్మరసం మిశ్రమం యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. ఇది దురద, కాలిన గాయాలు వంటి మచ్చలను నివారిస్తుంది.

231
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles