కుందేలంటే భయం


Wed,May 15, 2019 11:14 PM

RABBIT
చరిత్రలో కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అవి నిజమా? లేక కల్పితామా? అనే సందేహం కలుగుతుంది. ఈ విషయం కూడా అదే కోవకు చెందిందే..

రాజ్యాలను పాలించే రాజులు కుందేళ్లకు భయపడ్డారు. వారెవరో కాదు ఒకరు ఫ్రెంచ్ నాయకుడు నెపోలియన్, మరొకరు అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్. రష్యాపై నెపోలియన్ విజయం సాధించిన తర్వాత ఆ విజయాన్ని కుందేళ్ల వేటతో ఆస్వాదించాలనుకున్నాడు. అందుకు తన సైన్యం ఓ మైదానంలో వందలాది కుందేళ్లను సిద్ధం చేసింది. నెపోలియన్ తన సైనికాధికారులతో వాటిని వేటాడడం ప్రారంభించాడు. కుందేళ్లు తిరగబడి, ఆయనతో సహా సైనికులందరి పైకి దూసుకెళ్లాయి. దీంతో నెపోలియన్ కుందేళ్లకు భయపడిపోయాడు. చివరికి ఆయన కుందేళ్ల ధాటిని తట్టుకోలేక వెనుతిరగాల్సి వచ్చింది. అలాగే జిమ్మీ కార్టర్ 1979లో తన జీవితంలో ఓ వింత సంఘటనను ఎదుర్కోవాల్సి వచ్చింది. నిరంతరం భారీ బందోబస్తుతో ఉండే ఆయన.. తన సెక్యూరిటీని వదిలి ఓ సరస్సులో చేపలను వేటాడేందుకు వెళ్లాడు.

ఆ సమయంలో ఒడ్డున ఉన్న కుందేలు ఆయనపైకి దూకింది. అంతేకాదు ఆయనతో పెనుగులాడింది కూడా. చివరకు కార్టర్ ఏదోవిధంగా దాని బారి నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటన అప్పట్లో మీడియా కంటపడడంతో సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్షుణ్ణి చంపబోయిన కుందేలు అంటూ వార్తలు కూడా వచ్చాయి.

111
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles