సూపర్‌ఫుడ్‌తో అద్భుతాలు చేసింది!


Thu,May 16, 2019 01:13 AM

సరైన పోషకాహారం అందక చిన్నారులు, మహిళలు ఎన్నో రుగ్మతలకు గురవుతున్నారు. ఆయా అనారోగ్య సమస్యలకు వినూత్న పరిష్కారాన్ని అందిస్తున్నది ఓ విశ్రాంత ప్రొఫెసర్. రెండు దశాబ్దాల నుంచి మహిళలకు పోషకారంతో పాటు, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులను నింపుతున్నది.
rajasthan-woman
భారతదేశంలో పోషకాహార సమస్యతో ఎంతోమంది పలురకాల వ్యాధుల బారిన పడుతుండగా, మరికొంతమంది ప్రాణాలు వదలాల్సి వస్తున్నది. ఈ సమస్యకు తన పరిశోధనలతో వినూత్న పరిష్కారాన్ని అందించింది 78 యేండ్ల పుష్పశ్రీవాస్తవ అనే మహిళా ప్రొఫెసర్. గ్రామీణ మహిళలకు స్పిరులిన అనే గ్రీన్‌ఫుడ్ ద్వారా ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని అందిస్తున్నది. 20 యేండ్లుగా ఆమె సూపర్‌ఫుడ్‌తో అద్భుతాలు సృష్టిస్తున్నది. పుష్పశ్రీవాస్తవ 1971లో రాజస్థాన్ యూనివర్సిటీలో బోటనీ ప్రొఫెసర్‌గా చేరింది. ఆ సమయంలో ఆమె పోషకాహారంపై 11రకాల రీసెర్చ్ ప్రాజెక్టులను తయారు చేసింది. ఈ ప్రాజెక్టులను దేశ, విదేశాల్లోని పేరుగాంచిన పరిశోధనా కేంద్రాలకు సమర్పించింది. స్పిరులిన అనే గ్రీన్ ఫుడ్‌లో లభించే పోషకాలను గురించి తన పరిశోధనల ద్వారా వెల్లడించింది. ఒక కిలో పండ్లలో లభించే విలువైన పోషకాలు కేవలం ఒక గ్రాము స్పిరులిన పొడి ద్వారానే సమకూరుతాయని తెలిపింది. దీంతో రాజస్థాన్ బోటనీ విభాగం స్పిరులిన సాగు చేసేందుకు కొంత భూమితోపాటు, రూ.42 లక్షలు కేటాయించింది. ఈ ఫుడ్ ప్రభావం ఎంత వరకూ పనిచేస్తుందనేందుకు కొంతమంది పోషకాహార నిపుణులతో కలిసి 400మందికి ఈ ఫుడ్‌ను అందించింది. అనంతరం మంచి ఫలితాలు కనిపించడంతో మరింత మందికి స్పిరులినను ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే లాభాలను గురించి వివరిస్తున్నది. అలా జనాలకు స్పిరులినపై అవగాహన కల్పించింది. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా పుష్పశ్రీవాస్తవ గుజరాత్‌లో స్పిరులిన ప్రాజెక్టును 90 మందితో ఏర్పాటుచేసింది. వారానికి 30కిలోల స్పిరులినను పండిస్తున్నారు. ఈ పొడితో బిస్కెటు తయారుచేసి అమ్ముతున్నారు. రోజుకు వెయ్యి రూపాయలకు పైగా సంపాదిస్తున్నారు.

102
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles