పిల్లల భవిష్యత్ తల్లిదండ్రులతోనే..


Thu,May 16, 2019 01:12 AM

parents
-పిల్లల చదువుకి సంబంధించిన ఎంతో కొంత పరిజ్ఞానాన్ని తల్లిదండ్రులు తప్పకుండా తెలుసుకోవాలి. పిల్లలకు ఊహ వచ్చేటప్పటి నుంచి వాళ్లకు మంచి మంచి అలవాట్లు నేర్పించాలి.
-వారి భవిష్యత్ పట్ల తల్లిదండ్రులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. అందుకోసం ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి.
-అతి గారాబం ఒక్కోసారి వాళ్ల జీవితానికి సమస్యలు తెచ్చిపెట్టవచ్చు. వీలైనంత వరకు ఎక్కువ సమయం పిల్లలకు కేటాయించాలి. కేవలం డబ్బు వారి అన్ని అవసరాల్ని తీరుస్తుందనుకోవడం పొరపాటు. తల్లిదండ్రుల ప్రేమానురాగాలు వాళ్లకు చాలా అవసరం.
-పిల్లలపై అతిగా కోపం ప్రదర్శించవద్దు. అలా చేయడం వల్ల వాళ్లు మొరటుగా మారే అవకాశం ఉంటుంది. పిల్లల్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని వాళ్లు చేసిన పొరపాట్లు పర్యవసానాలు ఏమిటో వారికి అర్థం అయ్యేలా చెప్పాలి.
-కొంత సమయాన్ని వారికి నైతిక విలువలు నేర్పించేందుకు కేటాయించాలి. అందుకోసం కొన్ని నీతి కథలు వంటివి ఉదాహరణగా చెప్పాలి. చాలామంది తమ పిల్లలు నచ్చిన ఆహార పదార్థాలు కొనమని మారాం చేస్తుంటారు. అవి వారి ఆరోగ్యానికి ఏమైనా హాని చేస్తాయా అని ఆలోచించాలి. కొన్ని రోజులకు వారే అలవాటు పడతారు.
-సమయం దొరికినప్పుడు వాళ్లకు నృత్యం, డ్రాయింగ్, పెయింటింగ్, చిన్న చిన్న ప్రయోగాలు చేయడం వంటి అలవాట్లను నేర్పించాలి. అవి వారి వ్యక్తిగత అభిరుచులను అభివృద్ధి చేస్తాయి. ఒక్కోసారి ఈ అభిరుచులే వాళ్లకు సమాజంలో ప్రత్యేక గుర్తింపును కూడా తీసుకు వస్తాయి.

85
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles