అదిరే గ్యాడ్జెట్లు.. అద్భుత ఫీచర్లు


Wed,May 15, 2019 01:36 AM

sanketha
కొత్త ఎప్పుడూ వింతే. ఈరోజు అద్భుతంగా అనిపించింది రేపటికల్లా సాధారణంగా మారుతుంటుంది. అంతా కాల మహిమ. అయినా కొత్త టెక్నాలజీ, కొత్త ఫీచర్లు, కొత్త గాడ్జెట్లు ఇలా రోజూ ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వాటిలో బడ్జెట్ ధరలో ఉండి ఇటీవల పాపులర్ అయిన కొన్ని గ్యాడ్జెట్స్ ఇవి.
sanketha1

ఆల్ట్రా బ్రష్ 360

రోజూ రకరకాల ఆహారం తీసుకుంటాం. మాంసాహారం, శాకాహారం పదార్థాలేమైనా అవి ఒక్కోసారి పంటి మధ్య ఇరుక్కుపోతాయి. వాటిని తొలగించడానికి ఎంత నాణ్యత కలిగిన బ్రష్‌లు ఉపయోగించినా పంటిని కొన్ని సార్లు 360 డిగ్రీలు శుభ్రం చేయలేవు. ఇలాంటి పరిస్థితి తరచూ కొనసాగితే అనారోగ్యానికి గురవ్వాల్సి వస్తుంది. డెంటిస్టును సంప్రదిస్తే తప్ప నోరు, దంతాలు పూర్తిగా శుభ్రపడవు. అలాంటి సమస్యను తీర్చడానికి ఆల్ట్రాబ్రష్ 360 ఉంది. పూర్తి వాటర్ ఫోర్స్‌తో ఇది పని చేస్తుంది. ఇంట్లో వాటర్ పైప్‌ను అమర్చుకొని లేదా దీంట్లోనే వాటర్ నింపి వాడుకోవచ్చు. వివిధ రకాల వాటర్ ఫోర్స్‌తో రిఫిల్స్ ఉంటాయి. వీటి ద్వారా ఇష్టమైన మోడ్‌లో సేవ్ చేసుకొని దంతాలను శుభ్రం చేయవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే పది రోజులు వరుసగా వాడుకోవచ్చు.
sanketha6

వైఫై బూస్టర్

ఇంట్లో లేదా ఆఫీస్‌లో వైఫై సాధారణం అయింది. అయితే మోడెమ్‌లను బట్టి స్పీడ్, పరిధి ఉంటుంది. ఆ వైఫై ఎక్కువ డివైజ్‌లకు కనెక్ట్ అయినా, నెట్‌వర్క్ సమస్యలు ఉన్నా బ్రౌజింగ్‌లో ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ సమస్యను తొలగించడానికి వాడే గ్యాడ్జెట్లే.. వైఫై బూస్టర్లు. వీటినే వైఫై ఎక్ట్స్‌టెండర్లు, రిపీటర్లు అంటారు. ఇవి సాధారణ వైఫై కంటే 300 ఎంబీఎస్ నెట్‌వర్క్‌ను ఎక్కువ పెంచుతాయి. కంపెనీని బట్టి వీటిలో తేడాలుంటాయి. మోడెమ్ నుంచి వైఫై బూస్టర్లు వాడి నెట్‌వర్క్ రేంజ్‌ను పెంచవచ్చు. ఒక గది నుంచి ఇంకో గదికి నెట్‌వర్క్‌ను నాణ్యతగా పొందడానికి ఇవి ఉపయోగపడతాయి.
sanketha2

బ్లూటూత్ ఆడియో రిసీవర్

ఇప్పుడంతా బ్లూటూత్ ఇయర్‌ఫోన్ల, హెడ్‌ఫోన్ల ట్రెండ్ నడుస్తున్నది. కానీ మీ దగ్గర ఉన్న వైర్డ్ ఇయర్ ఫోన్లనే బ్లూటూత్ ఇయర్ ఫోన్లుగా మార్చవచ్చని ఎప్పుడైనా ఊహించారా? బ్లూటూత్ ఆడియో రిసీవర్‌తో అది సాధ్యం అవుతుంది. ఇది ఫోన్ బ్లూటూత్‌కు కనెక్ట్ అవుతుంది. ఇయర్ ఫోన్ జాక్‌తో ఈ డివైజ్‌ను కనెక్ట్ చేస్తే చాలు బ్లూటూత్ సాయంతో ఇయర్‌ఫోన్స్ మొబైల్‌కు కనెక్ట్ అవుతాయి. అచ్చం బ్లూటూత్ ఇయర్ ఫోన్లలాగే ఈ డివైజ్ పని చేస్తుంది. కొన్ని కంపెనీలను బట్టి దీనికి మైక్రోఫోన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఫీచర్లు కూడా ఉంటాయి.
sanketha3

కార్‌డాక్

కారు డ్రైవింగ్ వచ్చాక మైనర్ రిపేరింగ్ తెలిసినప్పుడే ప్రయాణం సులభం అవుతుంది. లేకపోతే కారు ఆగిపోయినా, ఇంకేమైనా జరిగినా సతమతం అవ్వాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలను ముందే గుర్తించే టెక్నాలజీ పెద్ద కార్లలో ఉంటుంది కానీ చిన్న కార్లలో పరిస్థితి ఏంటి? అందుకే కార్‌డాక్ గ్యాడ్జెట్ ఉంది. 2006 మోడల్ కార్ నుంచి ఇప్పటి వరకూ ఏ కారుకైనా ఇది పని చేస్తుంది. ఈ చిన్న పాటి డివైజ్‌ను కారు పవర్ కేబుల్‌కు అనుసంధానించి, అండ్రాయిడ్ ఫోన్‌కు కనెక్ట్ చేయాలి. కారులోని సమస్యలను గుర్తించి స్క్రీన్‌మీద చూపిస్తుంది. సుమారు 3వేల కు పైగా మాన్యుఫ్యాక్చరింగ్ సమస్యలను ఇది గుర్తించగలదు.
sanketha4

క్యాష్ ప్రొటెక్ట్

కొద్దిగా జన సందోహం ఎక్కువ ఉంటే చాలు జేబు దొంగలు తమ చేతివాటం చూపిస్తుంటారు. అదే భయం చాలా మందిని వెంటాడుతుంటుంది ఎక్కడ తమ పర్స్ పోతుందోనని. క్యాష్ ప్రొటెక్ట్ వ్యాలెట్‌ను వాడితే అలాంటి టెన్షన్ ఉండదు. దీన్ని జీపీఎస్‌తో ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంట్లో పర్స్ మర్చిపోయినా, లేదా ఎవరైనా కొట్టేసినా ఈ వాలెట్‌ను ట్రాక్ చేయవచ్చు. దీనికి అలారమ్ కూడా ఉంటుంది. ఇంట్లో పెట్టి మర్చిపోయినప్పుడు ఫోన్ ద్వారా ఈ అలారమ్‌ను మోగించవచ్చు.
sanketha5

మాగీఫ్రై

ఏటా రెండు వందల గంటలకు పైగా సమయాన్ని వంట చేయడానికి, గిన్నెలు కడగడానికే ఉపయోగిస్తున్నారని ఒక అధ్యయనం. వంట చేయడం ఒక భాగం అయితే గిన్నెలను శుభ్రం చేయడం మరో భాగం. డిష్ వాషర్‌లు ఉన్నప్పటికీ అవి అందరికీ అందుబాటులో ఉండవు. అలాంటి వారి కోసం మ్యాగీ ఫ్రై పేరుతో డిష్ ఫ్రై పాన్ వచ్చింది. టాక్సిన్ ఫ్రీ సెరామిక్, టైటానియమ్ పాన్ ఇది. ఎలాంటి క్రీమ్‌లు, సబ్బులు వాడకుండానే దీన్ని సులభంగా శుభ్రం చేయవచ్చు. స్క్రబ్బర్లు వాడే శ్రమ కూడా లేదు. స్టవ్‌లపైనా, ఓవెన్‌లలో దీన్ని సులభంగా వాడవచ్చు.

298
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles