వాట్సప్ స్టిక్కర్స్ తయారు చేయాలా?


Wed,May 15, 2019 01:22 AM

watsapp-stickers
వాట్సప్‌లో స్టిక్కరింగ్ ఫీచర్ వచ్చాక వాటి హవా బాగానే కొనసాగుతున్నది. మరి ఈ ఫీచర్‌లో ఇన్‌బిల్ట్‌గా వచ్చిన స్టిక్కర్లే కాకుండా సొంత స్టిక్కర్లు కూడా తయారు చేసుకోవచ్చు. ఇష్టమున్న ఫొటోనే స్టిక్కర్‌గా మార్చేయవచ్చు. ఎలా అంటే?

వాట్సప్ ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫొటోలనే స్టిక్కర్స్‌గా మలుచుకునే అవకాశం ఉంది. మొదట ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని ఫొటోను క్రియేట్ చేసుకోవడం. ఈ ఇమేజ్‌ను వాట్సప్ స్టిక్కర్స్‌లో యాడ్ చేయడం. వాట్సప్ స్టిక్కర్స్ ఫోన్‌లో ఓపెన్ అవ్వాలంటే వాట్సప్ వెర్షన్ 2.18 అయినా అంతకంటే ఎక్కువ వెర్షన్ అప్‌గ్రేడ్ అయి ఉండాలి. యాప్ అప్‌డేట్ అయ్యాక స్టిక్కర్‌గా మార్చాలనుకున్న ఫొటోను ఎంచుకోవాలి. సెలెక్ట్ చేసిన ఫోటోలను పీఎన్‌జీ ఫైల్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేయాలి. ఫోన్‌లోని బ్యాక్‌గ్రౌండ్ ఎరేజర్ యాప్ సాయంతో ఫొటో బ్యాక్‌గ్రౌండ్‌ను తీసేయాలి. దీనిలోని ఆటో, మ్యాజిక్, మాన్యువల్ ద్వారా ఫొటో బ్యాక్‌గ్రౌండ్‌ను తీసేయవచ్చు. ఇమేజ్‌కు నచ్చిన విధంగా క్రాప్ చేసి స్టిక్కర్ లుక్ తీసుకురావాలి. ఈ ఇమేజ్‌ని పీఎన్‌జీ ఫార్మాట్‌లోనే సేవ్ చేయాలి. ఆ తర్వాత గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి పర్సనల్ స్టిక్కర్స్ ఫర్ వాట్సప్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇది లాంచ్ అయిన వెంటనే క్రియేట్ చేసిన స్టిక్కర్స్ ఆటోమెటిక్‌గా డిటెక్ట్ అవుతాయి. ఈ యాప్‌లో యాడ్ స్టిక్కర్ బటన్ కనిపిస్తుంది. ఇది వరకే పీఎన్‌జీలో సేవ్ చేసిన ఫొటోలు అని సపోర్ట్ ఫైల్స్‌గా కనిపిస్తాయి. యాడ్ బటన్‌పై క్లిక్ చేసిన వెంటనే చాట్‌లోకి యాడ్ అవుతాయి. వీటిని ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ పర్సనలైజ్‌డ్ స్టిక్కర్స్ బ్యాంక్‌లో సేవ్ అవుతాయి.

428
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles