చక్కని ఇంటర్‌ఫేస్


Tue,May 14, 2019 11:17 PM

gmail
జీమెయిల్ ఓపెన్ చేయగానే స్క్రీన్ మొత్తం అవసరం లేని ఆప్షన్లతో గందరగోళంగా కనిపిస్తుంది. తరచూ వాడే ఆప్షన్లే కనిపించేలా జీమెయిల్ ఇంటర్‌ఫేస్ ఉండేలా చూడవచ్చు.

కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లో ప్రతిఒక్కరూ జీమెయిల్ వాడతారు. అందరికీ జీమెయిల్ ఇంటర్‌ఫేస్ ఒకటే ఉంటుంది. కానీ కొన్ని ఎక్స్‌టెన్షన్లు ఉపయోగించి కస్టమైజ్ ఇంటర్‌ఫేస్‌ను పొందవచ్చు. ఇంటర్‌ఫేస్‌లో అవసరమైన ఆప్షన్లను మాత్రమే పెట్టుకొని, అనవసరమైన వాటిని తొలగించు కోవచ్చు. ఇందుకోసం జీమెయిల్ ఇటీవల గూగుల్ ఎక్స్‌టెన్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అవసరమైన ఆప్షన్లు మాత్రమే చూపించే సింప్లిఫై జీమెయిల్ అనే ఎక్స్‌టెన్షన్‌ను లిస్టులో చేర్చింది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకున్న వెంటనే జీమెయిల్‌లో కుడి, ఎడమ వైపు కనిపించే సైడు బార్లు రెండూ హైడ్ అవుతాయి. దీంతోపాటు సెర్చ్ బార్ కూడా మినిమైజ్ అవుతుంది. అలాగే జీమెయిల్ ఫోన్లో మాదిరిగా కంపోజ్ బటన్ స్క్రీన్ కుడివైపునకు మారుతుంది. ఈ విధంగా గూగుల్ క్యాలెండర్, డాక్, టాస్క్ వంటి అన్ని రకాల ఆప్షన్స్ కుడిచేతి వైపు అడుగుభాగంలో కనబడతాయి. ఎడమచేతి వైపు స్క్రీన్ పైభాగంలో కనిపించే జీమెయిల్ లోగోని ఎక్స్‌టెన్షన్ తొలిగిస్తుంది. గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌తో జీమెయిల్ వాడకం సౌకర్యవంతతంగా ఉంటుంది.

164
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles