కండ్లపై ఒత్తిడి తగ్గించేందుకు ఓ యాప్


Tue,May 14, 2019 11:08 PM

reduce-stress
ఈ రోజుల్లో ఏ పని చేయాలన్నా కంప్యూటర్‌తోనే. స్క్రీన్ చూసి చూసి కండ్లు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. దీని నుంచి కొంత ఉపశమనం కోసం ఓ డెస్క్‌టాప్ అప్లికేషన్ ఉంది.

రోజువారి జీవితంలో కంప్యూటర్ ఓ భాగమైంది. విద్యార్థులకు, ఉద్యోగులకు కంప్యూటర్ లేనిదే రోజు గడవని పరిస్థితి. ఇలా చాలామంది రోజులో ఎక్కువ సేపు కంప్యూటర్‌తో గడపాల్సి వస్తుంది. పరిస్థితి కంటి మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తుంది. చిన్న అప్లికేషన్ వాడడం ద్వారా కంప్యూటర్‌తో గడిపేవారు ఈ ఒత్తిడి నుంచి కొంతైన ఉపశమనం పొందవచ్చు. పోమి అనే అప్లికేషన్‌ను కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేస్తే ప్రతి 20 నిమిషాలకి ఒకసారి కంటిమీద ఒత్తిడి పడకుండా రిలాక్స్‌గా ఉంచడానికి సహకరిస్తుంది. విండోస్ కంప్యూటర్ వాడేవారు ఇంటర్‌నెట్‌లో పోమి వెతికి క్లిక్ చేస్తే ఉచితంగా ఇన్‌స్టాల్ అవుతుంది. దీన్ని ఓపెన్ చేస్తే ఎల్లప్పుడూ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటుంది. డెస్క్‌లాట్ నుంచి వచ్చే కాంతిని సందర్భానుసారం తగ్గించడం, పెంచడం దీని పని. 20 నిమిషాల తర్వాత కంప్యూటర్‌ని 6 మీ. దూరంలో ఉన్న వేరే వస్తువు మీదకి మళ్లించాలి. తప్పనిసరిగా ప్రతి డెస్క్‌టాప్ యూజర్ వినియోగించాల్సిన అప్లికేషన్ ఇది.

122
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles