మది దోచిన సుందరి!


Wed,May 15, 2019 01:05 AM

ప్రియా ప్రకాశ్ వారియార్ తెలుసు కదా? ఎంత ఊపు ఊపింది కుర్రకారును. ఒక్క కుర్రకారునేంటి? అందర్నీ తమ యంగేజ్ ఫీలింగ్స్‌లోకి తీసుకెళ్లింది. అలాంటి మరొక అందాల భామ వచ్చ్చింది. సోషల్ మీడియాలో ఎవరు చూసినా ఆమె గురించే వెతుకులాట. దీంతో ప్రియా ప్రకాశ్ కంటే తొందరగా ఫేమస్ అయిపోయిన భామగా నిలిచింది.
Adithi
ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్ గర్ల్ దీపిక ఘోష్ వెంటపడ్డ అభిమానులు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఫ్యాన్ గర్ల్‌పై కన్నేశారు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ మ్యాచ్‌లో చిరునవ్వులు చిందించి యువత మనసును కొల్లగొట్టింది ఈ సుందరి. క్రికెట్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్న సమయంలో ఆమెను ఓ ఫ్రేమ్‌లో చూపించిన కెమెరామన్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు అభిమానులు. ఫైనల్‌మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ ఫ్రేమ్‌లో తళుక్కుమన్న భామ ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలం కుర్రకారులో విపరీతంగా పెరిగిపోయింది. ఆమె గురించి విపరీతంగా ఇంటర్నెట్లో శోధించారు. ఆమె ఎవరో పట్టేశారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? సాదాసీదా వ్యక్తి మాత్రం కాదు. 2018లో మిస్ దివా సూపర్ నేషనల్ టైటిల్ సుందరి అదితీ హుందియా. పోలాండ్‌లో జరిగిన అందాల పోటీల్లో హుందియా ఇండియా తరపున పాల్గొన్నది. 2017లో ఫెమీనా మిస్ ఇండియా జాబితాలో స్థానం సంపాదించింది. అంతేకాదు కలర్స్ ఫెమీనా మిస్ ఇండియా రాజస్థాన్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నది. అదితీ హుందియాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఐపీఎల్ పుణ్యమా అని ఇప్పుడు అదితీ హుందియా క్రేజ్ మరింతగా పెరిగింది.

93
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles