దర్శకుడై గెలిచాడు


Wed,May 15, 2019 01:04 AM

ఒక్కో మనిషిలో ఎన్నో పార్శాలు.. వెళ్లే మార్గంలో ఎన్నో మూల మలుపులు.. ఇలా ఏ మలుపు జీవితాన్ని నిలబెడుతుందో తెలియదు. ఒక కళ ఉంటే ఒకదానిపైనే ప్రయాణించాల్సి వస్తుంది. కానీ వివిధ కళలు ఒకే వ్యక్తికి ఉంటే.. సరిగ్గా అదే సమస్య 2008 నుంచి 2014 వరకు ఒక యువకుడిని వేధించింది. విద్యార్థిగా.. ఫొటో జర్నలిస్టుగా.. తర్వాత ఉపాధ్యాయుడిగా.. ఆ తర్వాత గేమ్ డెవలపర్‌గా ఇలా కొన్ని రంగాల్లో అడుగుపెట్టాడతను. చివరికి సినీ రంగంలో స్థిరపడ్డాడు చెన్నైకి చెందిన 28 ఏండ్ల యువకుడు.
Akshay
అతడి పేరు అక్షయ్ సుందర్. 2015లో విడుదలైన ఆఫ్టర్ లైఫ్ సినిమా డైరెక్టర్ అతడే. అప్పట్లో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. కారణమేంటంటే హంగు, ఆర్భాటాలు లేకుండా.. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం పూర్తిగా ఎమోషన్స్‌కు సంబంధించింది. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది, ప్రతి సమస్యకు ఆత్మహత్యే పరిష్కారం కాదు.. అని ఈ సినిమా ద్వారా చూపించారు. చిత్రరంగంలో ఎన్నో ఇబ్బందులనెదుర్కొని ముందుకెళ్తున్నాడు అక్షయ్. ఇప్పటివరకు కొన్ని సందేశాత్మక వీడియోలు, సమాజంలో చైతన్యం కలిగించే చిన్న చిత్రాల్ని నిర్మించాడు. అంతేకాకుండా.. ఇటీవల అక్షయ్ వీఐయూ సిరీస్ గ్యాంగ్‌స్టర్ డైరీస్‌కు కూడా దర్శకత్వం వహించాడు. చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకున్నాడు అక్షయ్.

89
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles