సంకేత భాషా నేర్పరులు


Wed,May 15, 2019 01:03 AM

మీకు అర్థం కాని, పూర్తిగా పరిచయం లేని భాష మాట్లాడే ప్రదేశానికి వెళ్లారనుకోండి. మీరేం చేస్తారు? నోరున్నా మాట్లాడలేని పరిస్థితి. కానీ ఏదో ఒక విధంగా భావాల్ని వ్యక్తీకరించక తప్పదు. అదే సంకేత భాష. అంటే సైగలతో చెప్పడమన్నమాట.
Sign-Language
ఈ సైగల భాషను నేర్పే వారు ఎవరు? వారెక్కడుంటారు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం మా దగ్గరుందంటున్నారు బెంగళూరుకు చెందిన యువత. విధూషి, జయస్వాల్, విష్ణు సోమాన్ సోషల్ వర్కర్స్. వీరు రోజుకో పదం చెప్పి ఆ పదాన్ని ఎలా సంకేత భాషలో వ్యక్త పర్చాలో చెబుతుంటారు. ఈ సంవత్సరం చివరి వరకు 50 వేల మందికి సైన్ లాంగ్వేజ్ నేర్పించాలనే లక్ష్యంతో వీరు ముందుకెళ్తున్నారు. నేనొక మూగ, చెవిటి వ్యక్తి వద్ద ఈ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నా. మరింత మందికి ఈ భాషను పరిచయం చేయాలనుకున్నా. నా స్నేహితుల ప్రోత్సాహంతో ఇప్పటికే చాలామందికి ఈ సంకేత భాష నేర్పించా. మేమంతా కలిసి ఇంకా అనేక మందిని మాతో చేరేట్లు ప్రయత్నిస్తాం. అని చెబుతున్నది విధూషి. ఈ భాష ద్వారా ఇతర ఎన్నో నైపుణ్యాలు కూడా అలవడుతాయట. ప్రతిభామూర్తులగా నిలబడుతారట. అందుకే తానే కాదు.. అందరూ సోషల్ మీడియా వేదికగా సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ప్రయత్నించండని చెప్తున్నారు.

69
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles