ఆల్కహాలిజం పోవాలని!


Wed,May 15, 2019 01:03 AM

మద్యపానం ఒక కల్చర్‌గా మారిపోతున్నది. తప్పనిసరి అయి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆలోచించింది ఓ యువతి. యాంటీ ఆల్కహాలిజం మూమెంట్‌ను కళాత్మకంగా.. సందేశాత్మకంగా నడిపిస్తున్నది.
Pallavi-Chandar
బెంగళూరుకు చెందిన పల్లవి చందర్ ఆర్ట్స్ స్టూడెంట్. చిన్నప్పటి నుంచే ఆమెకు కళల పట్ల మక్కువ ఏర్పడింది. అప్పటి నుంచే రాసేది కూడా. పెరుగుతున్న కొద్దీ సామాజిక స్పృహ పెరుగుతూ వచ్చింది. బెంగళూరు చిత్రకళా పరిషత్‌లో విజువల్ ఆర్ట్స్ డిగ్రీ పొందింది. అప్పటి నుంచిసామాజికావసరాల గురించి అనేక ప్రదర్శనలు ఇచ్చింది. సమాజంలో ఆర్థిక వ్యత్యాసాలు ఎందుకుంటున్నాయో అధ్యయనం చేసిన ఆమె పేదరిక నిర్మూలనపై దృష్టిసారించారు. చాలామంది మద్యపానం.. దాని వల్లనే పేదరికం చాటున నేరాలు పెరిగిపోతున్నాయని భావించారు పల్లవి. బెంగళూరులోని నిరుపేదల పిల్లలందర్నీ ఒక చోటుకు చేర్చి వారిలో యాంటీ ఆల్కహాలిజం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. వాటిని ఏదో పాఠం చెప్పినట్టు చెప్తే బాగుండదనీ నృత్యం.. పెయింటింగ్ రూపాల్లో ప్రదర్శిస్తున్నారు. ఆల్కహాలిజం పోవాలన్నదే లక్ష్యంగా పెట్టుకొని కళల ద్వారా ఉద్యమం ప్రారంభించిన ఆమెను బెంగళూరు ప్రజలు అభినందిస్తున్నారు.

92
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles