నారసింహస్వామి అనుగ్రహానికి వేళ ఇదే!


Fri,May 10, 2019 01:06 AM

Ila-cheddam
నేటి నుంచి నరసింహస్వామి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలలోనే కాకుండా చాలామంది తమ ఇండ్లలోనూ నరసింహస్వామి జయంతి సందర్భంగా నవరాత్రులన్ని రోజులూ పొద్దూ మాపూ అత్యంత భక్తి శ్రద్ధలతో షోడశోపచార పూజలు జరుపుతారు. షష్టి (నేడు) తిథినుంచి మొదలై త్రయోదశి (17వ తేది) నాటి స్వామి పుట్టిన రోజున ఇవి ముగుస్తాయి. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో నాలుగవది నరసింహావతారం. నరసింహస్వామి వ్రతం, ఆరాధన వల్ల తెలియక చేసిన పాపాలు సైతం హరించుకుపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా స్వామి జయంతి నాడు అత్యంత వైభవంగా ఆరాధనలు జరుగుతాయి. నరసింహస్వామికి తులసీమాలను సమర్పించాలని, నేతి దీపం వెలిగించాలని, పానకం వడపప్పు నైవేద్యంగా సమర్పించుకోవాలని, వీటివల్ల కోరిన కోర్కెలు సిద్ధిస్తాయని వేదపండితులు చెప్తారు.

106
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles