యూట్యూబ్ నుంచి షాపింగ్


Wed,May 8, 2019 12:26 AM

యూట్యూబ్ నుంచి వీడియోలు చూడడమే కాదు షాపింగ్ కూడా చేయొచ్చు. అలాంటి ఫీచర్‌ను వినియోగదారుల కోసం యూట్యూబ్ తీసుకురాబోతుంది. వీడియోలు చూస్తూనే రెకమెండేషన్స్‌లో వచ్చే వస్తువులను కొనుక్కొనే వీలుంది. ఈ ఫీచర్ కోసం ఆన్‌లైన్ షాపింగ్ లింక్స్‌ను గూగుల్ టెస్ట్ చేస్తున్నది.
youtube
ఇప్పటి వరకూ యూట్యూబ్‌లో ఆన్‌లైన్ షాపింగ్‌ల యాడ్స్ మాత్రమే కనిపించేవి. వాటి ద్వారా ఆయా ఈ కామర్స్ వెబ్‌పేజీలోకి వెళ్లి షాపింగ్ చేయాల్సి ఉండేది. కానీ ఇక నుంచి అలా కాకుండా నేరుగా యూట్యూబ్ నుంచే ఆన్‌లైన్ షాపింగ్ చేయడం సాధ్యం అవుతుంది. ఈ తరహా షాపింగ్ లింక్స్‌ను గూగుల్ పరిశీలిస్తున్నది. గూగుల్ షాపింగ్ పేరుతో రీబ్రాండ్ చేస్తున్నట్టు గూగుల్ కంపెనీ ఇటీవల వెల్లడించింది. యూట్యూబ్ వీడియో ప్లే అవుతున్నప్పుడు ప్రోడక్ట్‌ల వివరాలు డిస్‌ప్లే అవుతుంటాయి. ధర, డెలివరీ వివరాల సమాచారం అంతా నేరుగా ఈ లింక్‌లోనే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే వేరే గూగుల్ ట్యాబ్‌లో నుంచే షాపింగ్ చేయవచ్చు. ప్రొడక్ట్ సెర్చ్ చేయడానికి గూగుల్ టెక్స్, ఇమేజ్ సెర్చ్, యూట్యూబ్ వీడియో వంటి షాపింగ్ లింకులను డిస్‌ప్లే చేయనుంది. ఇప్పటికే ఆన్‌లైన్ షాపింగ్‌లో దూసుకుపోతున్న అమెజాన్ ఆన్‌లైన్ అడ్వైర్టెజింగ్ బిజినెస్‌లో భారీగా లాభాలు పొందుతున్నది. ఈ నేపథ్యంలోనే గూగుల్ అడ్వైర్టెజింగ్ బిజినెస్‌లోకి దూసుకొచ్చేందుకు షాపింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

352
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles