డిస్క్ ఇరుక్కుపోయిందా?


Wed,May 8, 2019 12:26 AM

disk
కొన్నిసార్లు కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లలో డిస్క్ ( డీవీడీ,సీడీ) ఇరుక్కుపోతుంది. ఒక్కోసారి కరెంట్ పోయినప్పుడు డిస్క్ డ్రైవ్ నుంచి సీడీని, డీవీడీని డ్రైవ్‌లోనే వదిలేయాల్సి వస్తుంది. మళ్లీ పవర్ వచ్చేంత వరకూ ఆగాల్సి వస్తుంది. కానీ పవర్ లేకపోయినా డ్రైవ్‌ను ఓపెన్ చేయవచ్చు. అదెలాగంటే?..
కంప్యూటర్, ల్యాప్‌టాప్‌కు ఉండే ప్రతీ డిస్క్‌డ్రైవ్ పైన ఒక పిన్ హోల్ ఉంటుంది. చాలా చిన్నగా ఉండే రంధ్రం ఇది. దానితో ఏం ఉపయోగం అని చాలా మంది అనుకుంటారు. దీన్ని మాన్యూవల్ ఇజెక్టింగ్ హోల్ అంటారు. దీనితోనే డ్రైవ్‌ను ఓపెన్ చేయొచ్చు. ఈ రంధ్రం లోపలికి పిన్ (సూది)ని గుచ్చితే డ్రైవ్ ఓపెన్ అవుతుంది. అచ్చం స్మార్ట్ ఫోన్లకు ఉండే సిమ్ స్లాట్ లాగా ఇది పని చేస్తుంది. పవర్ పోయినప్పుడు ఇలా డ్రైవ్‌లోని డిస్క్‌ను తీయవచ్చు. తరచూ ఇలా ప్రయత్నించినా హార్డ్‌వేర్ మీద ఎలాంటి ప్రభావం చూపదు.

128
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles