ఒంటికాలితో పోరాటం!


Wed,May 8, 2019 12:26 AM

ఆశ అందరికీ ఉంటుంది. అది కొందరికి నిరాశ నిస్పృహల్ని కలిగిస్తే మరికొందరికి లక్ష్యంగా ఏర్పడుతుంది. కాలు లేకున్నా ఫుట్‌బాల్ ఆడాలనుకున్న వైశాఖ్ తన ఆశను లక్ష్యంగా మార్చుకొని విజయం దిశగా దూసుకెళ్తున్నాడు.
Vysakh
వైశాఖ్‌ది కర్నాటక. చిన్నప్పట్నుంఛఋ చురుకైన అబ్బాయి. చదువులోనే కాదు ఆటల్లోనూ మంచి నైపుణ్యం ఉండేది. గ్రౌండ్‌లో పదిమంది ఉంటే ఆ పదిమందిలో వైశాఖ్ కచ్చితంగా ఉండేవాడు. టీనేజ్ దాటిన తర్వాత తన ఏకాగ్రత ఫుట్‌బాల్‌పై పెట్టాడు. అప్పుడు అతనికి 13 సంవత్సరాలు. సోదరుడితో కలిసి బైక్‌మీద గ్రౌండ్‌కు వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బైక్ నుజ్జునుజ్జయింది. సోదరుడికి స్వల్ప గాయాలు అయ్యాయి. కానీ దురదృష్టం బస్సు రూపంలో వెంటాడి వైశాఖ్ కాలు విరిగిపోయింది. డాక్టర్లు కాలు తీసేయాల్సిందేనన్నారు. వేరే మార్గమేమీ లేకపోవడంతో వైశాఖ్ కాలు తొలగించారు. ఒక చిన్న అనుకోని ఘటన అతడి జీవితాన్ని మార్చేసింది. ఏళ్ల తరబడి హాస్పిటల్‌లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటికొచ్చాక అంతా అంధకారం కనిపించింది.

ఏ ఒక్క పది నిమిషాలు కూడా ఇంటిపట్టున ఉండని తనకు బోరింగ్ అనిపించింది.తాను ఎలాగైనా మళ్లీ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాలి అనుకున్నాడు. పట్టుదలతో డాక్టర్లను ఒప్పించాడు. పేరెంట్స్ ఆశీర్వాదం తీసుకున్నాడు. మెల్లిమెల్లిగా గ్రౌండ్‌కు వెళ్లడం.. తోటి ఆటగాళ్ల ఆటతీరును చూస్తూ గడిపాడు. ఎంతసేపు ఇలా వచ్చి కూర్చుంటాం అని సాధన చేశాడు. కట్‌చేస్తే ఇప్పుడు కాలు లేకున్నా ఫుట్‌బాల్‌లో మేటిగా రాణిస్తున్నాడు. ఇప్పుడు అతని వయసు 26 సంవత్సరాలు. అసలు నడుస్తాడో లేడో అనుకున్న తమ కొడుకు ఫుట్‌బాల్‌లో అద్భుతాలు సృష్టిస్తుండటం చూసి వైశాఖ్ పేరెంట్స్ ఆనందిస్తున్నారు.

155
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles