బర్త్‌డే బంప్స్ ఓ రుగ్మత


Wed,May 8, 2019 12:25 AM

ట్రెండ్స్.. కొన్నిసార్లు మంచి చేస్తాయి. విపరీత ధోరణి అవలంబిస్తే కొన్నిసార్లు చెడు చేస్తాయి. ఇటీవల వచ్చిన బర్త్‌డే బంప్స్ యువతకు కిక్కు ఇస్తున్నప్పటికీ లేనిపోని సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయి. వాటిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Birthday-Bumps
బర్త్‌డే బంప్స్ సరదా కోసమే కావచ్చు. కానీ దానిని ర్యాగింగ్.. టీజింగ్ కంటే తీవ్రంగా పరిగణిస్తున్నారు మానసిక నిపుణులు. మధ్య ఆసియాలోని కిర్గిజిస్థాన్ దేశంలోని ఇటీవల జరిగిన బర్త్‌డే బంప్ ఘటన సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీసింది. ఫన్ కోసం అని చెప్తున్నప్పటికీ యువతలో ఇది మానసిక సమస్యలను కలిగించే ప్రమాదం ఉందంటున్నది ఆకాశ్ హెల్త్‌కేర్ బృందం. బర్త్‌డే బంప్స్ పేరిట కిందపడేసి ఇష్టమొచ్చినట్లు తన్నడం వల్ల లోపలి అవయవాలు దెబ్బతింటాయనీ.. వెన్నెముక డ్యామేజీ అయ్యే ప్రమాదం ఉందని మాక్స్ స్మార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బృందం పేర్కొన్నది. అసలు బర్త్‌డే బంప్స్ అనేది ఓ ట్రెండ్ కానేకాదనీ.. అదొక మానసిక రుగ్మత అని వారు వివరించారు. ట్రెండ్స్ అనేవి సమాజంలో మంచి మార్పులు తీసుకురావాలికానీ.. అస్పృశ్యతను కలిగించే విధంగా ఉండొద్దని సూచించారు. యువత లక్ష్యం మీద పెట్టాల్సిన దృష్టి ఇలాంటి పనికిరాని ట్రెండ్స్‌పై పెట్టడం ఎంతమాత్రం మంచిదికాదనేది వారి వాదన.

137
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles