వదంతుల్లో యూత్ ఫస్ట్!


Wed,May 8, 2019 12:24 AM

యువతకు వాస్తవ విషయాలపై కంటే పుకార్లపై శ్రద్ధ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు పరిశోధకులు. స్కూల్ ఏజ్ నుంచి మొదలయ్యే ఈ పుకారు ఆసక్తి.. యంగేజ్‌లోకి వచ్చేసరికి అలవాటుగా మారిపోతుందట. రోజూ ఏదో ఒక గుసగుస లేనిదే యువత ముచ్చట సాగదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
Gossiping
పుకారు అనగానే ఎగిరి గంతేసే యువత సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుందని అమెరికాకు చెందిన పరిశోధకులు చెప్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు తాజాగా పుకార్లపై అధ్యయనం చేశారు. ప్రతీ వ్యక్తి తన ముచ్చటలో సుమారు 52 నిమిషాల సమయం పుకార్లకే కేటాయిస్తారని వారి అధ్యయనంలో వెల్లడైందని నిపుణులు చెప్పారు. నెగెటివ్ విషయాల పట్ల ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండటమే ఈ ధోరణికి కారణమట. వయసు పైబడిన వారితో పోలిస్తే యువతే ఎక్కువగా పుకార్లతో షికారు చేస్తుందట. ఇది ఒకరకంగా వారికి సంతోషాన్ని కలిగించే విషయమే అయినా అనవసర విషయాలపై రానురాను ఆసక్తిని ప్రేరేపిస్తుందని పేర్కొన్నారు. 18-58 సంవత్సరాల వయసున్న 269 మంది మహిళలు, 198 మంది పురుషులపై ఈ అధ్యయనం చేశారు.

106
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles