బార్బీ బొమ్మలా దీపికా!


Wed,May 8, 2019 12:22 AM

దీపికా పదుకోన్ మామూలుగానే తన అందంతో కనువిందు చేస్తుంది. ఇక కావాలని అందంతో ఫోజిస్తే ఎలా ఉంటుంది? అద్దిరిపోతుంది కదూ? మెట్ గాలా-2019 వేడుకల్లో ఇదే జరిగింది.
GALA-2019
దీపికా పదుకోన్ తన అందచందాలతో కనువిందు చేస్తూ బార్బీ బొమ్మలా కనిపించింది. మెట్ గాలా-2019 వేడుకల్లో ప్రియాంకాచోప్రా.. షాలినా నథానితో కలిసి దీపికా పాల్గొన్నది. పింక్ జాక్ పోజెన్ గౌన్ వేసుకొని ఆమె ర్యాంప్‌పై నడుస్తుంటే కేరింతలతో వేదికంతా మార్మోగింది. దీపిక అలా నడుస్తూ ఉంటే ఏదో పొడవాటి రైలు పోయినట్లు కనిపించింది ఆమె డ్రెస్. స్ట్రాప్లెస్ కోర్సెట్ టాప్.. లేయర్డ్ స్కర్ట్.. క్రిస్టల్ డిటేలింగ్ రెట్టింపు అందాన్ని తీసుకొచ్చాయి. పంకీ హెయిర్ స్టయిల్.. ఆమె డ్రెస్ టెయిల్ ఒకేలా ఉండేట్లు డిజైనర్ మేకప్ చేశారు. చాలాకాలం తర్వాత ర్యాంప్ మీదికి వచ్చిన దీపిక అందాలను ఆస్వాదించిన ఆమె అభిమానులు ఆమెను అభినందించారు. బార్బీ బొమ్మలాంటి దీపికా గెటప్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నది.

141
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles