ఫాస్ట్‌ఫుడ్‌తో ఒత్తిడి!


Sun,May 5, 2019 01:08 AM

మీకు ప్రతి రోజూ ఫాస్ట్‌ఫుడ్ తినే అలవాటు ఉందా? అయితే ఈ ఆహారపు అలవాటు మార్చుకోవాల్సిందే. లేకపోతే ఒత్తిడికి గురయి.. అనారోగ్యం బారినపడే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
Fast-Food
ఫాస్ట్‌ఫుడ్ తింటూ సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు తీసుకోకుండా ఫాస్ట్‌ఫుడ్‌పై ఆధార పడుతున్న వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తున్నదని అంటున్నారు. బెల్జియంలోని ఘెంట్ యూనివర్సిటీకి చెందిన నటాలీ మైఖెల్స్ దీనిపై పరిశోధనలు జరిపారు. ఒత్తిడి సమయంలో కొవ్వులు, చక్కెరలు, ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకొనేందుకు చాలా మంది మొగ్గు చూపుతారని నటాలీ వ్యాఖ్యానించారు. యూనివర్సిటీ పరీక్షల సమయంలో విద్యార్థుల ఆహారపు అలవాట్ల గురించి ఆమె బృందం ఒక అధ్యయనం చేసింది. అందులో ఒత్తిడికి, ఆహారానికి దగ్గరి సంబంధం ఉందనే సిద్ధాంతం రుజువైందన్నారు. వివరాలను బ్రిటన్‌లోని గ్లాస్గోలో జరిగిన యూరోపియన్ కాంగ్రెస్ ఆన్ ఒబేసిటీ కార్యక్రమంలో నటాలి వెల్లడించారు. ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని చాలా అధ్యయనాలు గతంలోనూ చెప్పాయి.

139
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles