ఖరీదైన సాల్వేటర్ మండి ఎక్కడ?


Sun,May 5, 2019 01:07 AM

లియోనార్డో డావిన్సీ కుంచె నుంచి జాలు వారిన అద్భుత కళాఖండాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో సాల్వేటర్ మండి అనే కళాఖండం ప్రపంచంలోనే అత్యంత ఖరీదు పలికింది. ఇప్పుడా కళాఖండం ఎక్కడ ఉన్నది? అనేది అంతుచిక్కడం లేదు. అది ఎక్కడ ఉందనేది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది.
painting
లియోనార్డో డావిన్సీ 500వ వర్ధంతి సందర్భంగా పారిస్‌లోని లౌవ్రే మ్యూజియం ఎన్నో ఆశలు, అడియాశలకు వేదికైంది. సాల్వేటర్ మండి పెయింటింగ్‌ను 2019 సంవత్సరానికే గొప్ప కళాఖండంగా ఎంపిక చేసి, ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తామని కొందరు కళాకారులు ప్రకటించారు. కానీ అక్కడ ఆ పెయింటింగ్‌ను ప్రదర్శించకపోవడంతో.. ఆ పెయింటింగ్ ఎక్కడ ఉందనే అనుమానాలు ఎక్కువయ్యాయి. ఆ అద్భుత కళాఖండం కోసం.. నెట్టింటిని జల్లెడ పట్టారు నెటిజన్లు. సాల్వేటర్ మండి పెయింటింగ్‌ను 2017లో జరిగిన వేలంలో రూ. 3,127 కోట్లకు విక్రయించారు.

ఆ కళాఖండం క్రైస్తవుల దైవం యేసు ప్రభువును పోలి ఉంటుంది. సాల్వేటర్ అంటే లాటిన్ భాషలో లోక రక్షకుడు అని అర్థం. 2018 సెప్టెంబర్‌లో అబుదాబిలోని ఓ మ్యూజియంలో దీనిని ప్రదర్శించాల్సి ఉన్నది. కానీ, ఆ ప్రదర్శన కూడా వాయిదా పడింది. ఎందుకు వాయిదా పడిందనే దానిపై అబుదాబి అధికారులూ ఏ విధమైన వివరణా ఇవ్వలేదు. అంతేకాదు ఆ చిత్రాన్ని కొనుగోలు చేసిన వారి వివరాలూ వెల్లడించ లేదు. అబుదాబికి చెందిన పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆ పెయింటింగ్‌ను స్వాధీన పరుచుకున్నట్లు ధ్రువీకరించినా.. అందులో వాస్తవం లేదని కొందరు అంటున్నారు. దీంతో సాల్వేటర్ మండి పెయింటింగ్ ఎక్కడుందనేది.. చాలామందికి అంతచిక్కని రహస్యంగా మారింది.

123
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles