అమ్మాయిలకు వాళ్లంటేనే ఇష్టమట!


Sun,May 5, 2019 01:06 AM

మీకు రాజకీయాలంటే ఆసక్తి ఉందా? దేశ రాజకీయాలను ఎప్పుడూ ఫాలోఅవుతుంటారా? నలుగురితో కలిసి ఎన్నికలు, రాజకీయ నాయకుల గురించి చర్చిస్తుంటారా? అయితే అమ్మాయిలకు మీరు నచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
Dating
రాజకీయాలకు, అమ్మాయిలు నచ్చడానికి లింకు ఏంటని సందేహిస్తున్నారా? అమ్మాయిలకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారు అనే విషయంపై ఓ డేటింగ్ యాప్ సర్వే చేసింది. ఆ సర్వేలో కొత్త విషయాలు తెలిశాయి. అవేంటంటే.. ప్రపంచంలో 54 శాతం మంది అమ్మాయిలు స్థిరమైన రాజకీయ అభిప్రాయాలున్న అబ్బాయిలంటే ఇష్టమని చెప్పారట. లవర్స్ మాటల్లో పొలిటికల్ అంశాలు చాలా తక్కువగా ఉంటాయని ఇంతకు ముందు అనుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. చాలామంది ప్రేమికులు వారి సంభాషణల్లో ఎవరికి ఓటేశావ్? ఎవరు గెలుస్తారు? ఏ పార్టీకి మద్దతిస్తావు? ఏ నాయకుడు ఎలాంటివాడు వంటి టాపిక్స్ ఎక్కువగా ఉంటున్నాయట. మన దేశంలో మాత్రం వ్యక్తిగత జీవితాలపై రాజకీయాలు ప్రభావం చూపవని అమ్మాయిలు బదులిచ్చారట. ఇక ప్రపంచవ్యాప్తంగా 25 శాతం అమ్మాయిలు, 29 శాతం అబ్బాయిలు అసలు రాజకీయాలంటే ఇష్టమే లేదని చెప్పడం కొసమెరుపు. ఏదేమైనా ఎక్కువ శాతం అమ్మాయిలు పాలిటిక్స్ అంటే ఇష్టపడే అబ్బాయిలపైనే మనసు పారేసుకుంటారని సర్వేలో తేలింది.

175
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles